ఆదర్శ మార్కెట్లా ? అసాంఘిక అడ్డాలా ? బోర సుభాషన్న

సూర్యాపేట జిల్లా:కోటి మందికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో సకల సౌకర్యాలతో ఉన్న మార్కెట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి,ప్రజా బంధువు అవార్డు గ్రహీత,శ్రామిక వర్గ పోరాట యోధుడు బోరా సుభాషన్న ఆరోపించారు.ఆరేళ్ల కిందట జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రతి పదివేల మందికి ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదని బోరన్న పేర్కొన్నారు.

 The Ideal Market? Unsocial Barrier? Bora Subhasanna-TeluguStop.com

ఆదర్శ మార్కెట్ల పేరుతో 38 కోట్లతో నిర్మించిన భవనాలు నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో ప్రజా ఉద్యమ నాయకుడు కామ్రేడ్ బోరన్న ఆరోపించారు.దాదాపు 38 కోట్లకు పైగా వెచ్చించి ప్రజాధనంతో హైదరాబాద్ మహానగరంలో నిర్మించిన 36 మోడల్ మార్కెట్లలో 648 దుకాణాలు ఉన్నాయని,ఇందులో 648 నేటికి ఖాళీగానే ఉన్నాయని భారతీయ జనత రాజ్యం బి.జె.ఆర్.హైదరాబాద్ నగర కార్యకర్త బోర జై హింద్ భరత్ రాజా మహర్షి సర్దార్ పటేల్ ఫోన్ నెంబర్: 8328277285 తెలిసిన విషయాలను హైదరాబాద్ నగర ప్రజల తరఫున హైదరాబాద్ నగర పౌరుడిగా 1999 నుండి ఓ.యూ రోడ్డు విద్యానగర్ అంబర్పేట్ ప్రాంతంలో నివసిస్తున్న పేద వర్గాల శ్రేయోభిలాషి,ప్రజా నేస్తం బోర సుభాష్ చంద్రబోస్ యాదవ్ నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు వ్రాసిన బహిరంగ లేఖలో వివరించారు.ఆదర్శ మార్కెట్లుగా పేర్కొంటున్న 36 మార్కెట్లకు వాటిలో గల 648 దుకాణాలకు ఎన్నిసార్లు వేలం నిర్వహించిన వ్యాపారులు ముందుకు రావడం లేదని,వేలంలో దక్కించుకున్న వాళ్ళు సైతం వ్యాపారం ప్రారంభించేందుకు హడలెత్తుతున్నారని సిపిఐ (ఎం- ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర నాయకుడు వంగాల మల్లన్న సెల్ నెంబర్:9948610603 తెలిపిన విషయాలను బహిరంగ లేఖ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు ప్రజాస్వామిక వాది బోర సుభాషన్న.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆదర్శ మార్కెట్ల భవనాలు శిథిల భవనాలుగా తయారయ్యాయని బోరన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.2016 జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో మొదట డివిజన్1 భవిష్యత్తులో ప్రతి పదివేల మంది జనాభాకు ఓ మార్కెట్ ను అందుబాటులోకి తెస్తామని సర్కార్ హామీ ఇచ్చిన విషయాన్ని విప్లవ నాయకుడు కామ్రేడ్ బోర సుభాషన్న సెల్ నెంబర్: 9848540078 గుర్తు చేశారు.ఎన్నికలయ్యాక జిహెచ్ఎంసి ఇంజనీర్లు ఆదర్శ మార్కెట్ నిర్మాణం ప్రారంభించి మొదట 65 నిర్మించాలనుకొని, కనిపించిన ప్రతి ఖాళీ స్థలాన్ని ఎంపిక చేశారని బోరన్న పేర్కొన్నారు.

ఎక్కడ మార్కెట్ కడితే ప్రజలు ఆదరిస్తారు లేదా ఎక్కడ కడితే దుకాణాలు నడుస్తాయిని ఆలోచించకుండా చివరకు 36 చోట్ల కట్టారని,మరో రెండు చోట్ల నిర్మాణ పనులు ఆగిపోయాయని,మిగిలినవి వేరు వేరు కారణాలతో రద్దు చేశారని బోరన్న తెలిపారు.జి +1 పద్ధతిలో మొత్తం 18 దుకాణాలు స్త్రీ-పురుషులకు వేరువేరు మరుగుదొడ్లు,కార్యాలయం ఉండేటట్లు మోడల్ మార్కెట్ భవనాలు నిర్మించి,ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్కెట్లకు నాలుగేళ్లుగా అధికారులు వేలం ప్రకటనలు ఇవ్వడం,వేలం నిర్వహించడం, అద్దెలు చూసి వెనక్కి పోవడం సాధారణమైందని సామాజిక కార్యకర్త బహుజన రచయిత మేధావి ప్రొఫెసర్ వై.పి.యాదవ్ సెల్ నెంబర్: 9394243344 తెలిసిన విషయాలను మంత్రి కేటీఆర్ కు వివరించారు ప్రతిక్షణం ప్రజాహితమే ధ్యేయంగా జీవిస్తున్న ప్రజా పోరాట యోధుడు బోర సుభాషన్న.మార్కెట్లు నిర్మించిన ప్రాంతం నిర్మాణ ఆకృతి వంటి లోపాలు ఇందుకు కారణమని బోరన్న తెలిపారు అద్దె విలువ అ తగ్గించినప్పటికీ ఈ మార్కెట్లలో దుకాణం తెరిచేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాక పోవడంతో అధికారులు వేలం వేయడం ఆపేశారని కేటీఆర్ కి వివరించారు బోరన్న.ఈ నేపథ్యంలో నిర్మాణాలన్నీ శిథిలావస్థకు చేరుకుని నేడు ఇవి కుక్కలకు, త్రాగుబోతులకు,ఇతర అనేక అసాంఘిక కార్యక్రమాలకు వేదికలుగా మారాయని బోరన్న విమర్శించారు.

మహానగరంలోని 500 కాలనీల వారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కూరగాయలు విక్రయిస్తున్నా,ధరలు అధికంగా ఉండటం,తూకాల్లో తేడా రావడం వల్ల,దూరమైన చాలామంది రైతుబజార్ లకు,హోల్ సేల్ మార్కెట్లకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని వినియోగదారుల సమస్యలపై పోరాడుతున్న యువ న్యాయవాది వెన్న పూజ పరుశురాం వి.పి.ఆర్ యాదవ్ సెల్ నెంబర్: 9866765281 చెప్పిన విషయాలను కేటీఆర్ దృష్టికి తెస్తూ రాజధానిలో 11 రైతు బజార్లు ఉంటే ఒక్క దాంట్లో కూడా సరైన సౌకర్యాలు లేక జనం అష్ట కష్టాలు పడుతున్నారని అభ్యుదయవాది బోర సుభాష్ చంద్రబోస్ వాట్సాప్ నెంబర్ :9848540078 ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా ప్రారంభం కానీ, ఆదర్శ మార్కెట్లలో నెలకొన్న దుస్థితిని చూసేందుకు కేటీఆర్ ఒకరోజు స్వయంగా వెళ్లి విచారణ చేయాలని బోరన్న డిమాండ్ చేశారు.

ఉప్పల్,బీరప్పగడ్డ కూరగాయల మార్కెట్,రామంతపూర్ లో నిర్మించిన మూడు మోడల్ మార్కెట్లు మోడల్ మార్కెట్లో దుకాణం దక్కించుకున్న లీజు దారులు ముందుకు రావడం లేదని,బహుజన వర్గాల రాజ్యాధికారం బి.వి.ఆర్ నగర్ నాయకులు బోర విశ్వాస్ ఆదిత్య రాజయోగి మహాత్మ గాంధీజీ వాట్సాప్ నెంబర్: 6301893660 తెలిపిన విషయాన్ని బోరన్న వివరించారు.గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ లో వ్యాపారం నడవదని,దుకాణాల తలుపులు తేరవట్లేదని,దీంతో భవనం నిరుపయోగంగా మారిందని వ్యాపారవేత్త గంగా రామ్ సాయి ప్రసాద్ ఫోన్ నెంబర్: 9000666822 చెప్పిన విషయాలను బోర సుభాషన్న లేఖలో పేర్కొన్నారు.చందానగర్ సర్కిల్లోని మయూరి నగర్ మార్కెట్ హుడా కాలనీలో శిధిల భవనాలు దర్శనమిస్తున్నాయని బీసీ సంఘం నాయకుడు జూ క్రాంతి కుమార్ కుమార్,జే.పీ యాదవ్ సెల్:నెంబర్ 9000225010 చెప్పిన విషయాన్ని ప్రజా బంధువు బోర సుభాషన్న లేఖలో పేర్కొన్నారు.మన్సురాబాద్ జడ్జెస్ కాలనీ మార్కెట్ శిథిలంగా మారిందని బి.ఎన్.రెడ్డి నగర్ ఎన్జీవో కాలనీ మార్కెట్లో వ్యర్ధాలు,మందు సీసాలు కుప్పలుగా ఉన్నాయని, తలుపులు,విద్యుత్ మీటర్లు,గ్రిల్స్ ను ఆకతాయిలు విరగ్గొట్టారని,వనస్థలిపురం ఎఫ్సిఐ కాలనీలోని మార్కెట్ ది కూడా అదే దుస్థితని హైకోర్టు న్యాయవాది ఇదే ప్రాంతంలో జీవిస్తున్న దూకుంట్ల శ్రీధర్ ప్రజాపతి సెల్ నెంబర్:90000003713 చెప్పిన విషయాన్ని బోర మంత్రి కేటీఆర్ కు తెలిపారు.మైలార్దేవుపల్లి డివిజన్ టీఎన్జీవో ఎస్ కాలనీ ప్రేమవతి పేటలో నిర్మించిన రెండు మోడల్ మార్కెట్లు మందుబాబులకు అడ్డాలయ్యాయని టీఎన్జీవో కాలనీలో నిర్మాణం ధ్వంసమవుతున్నదని,ప్రేమవతి పేటలో అద్దెలు ఎక్కువ కావడం,ఇతర కారణాలతో దుకాణాలు తెరుచుకోవడం లేదని,విద్యార్థి, యువజన జేఏసీ చైర్మన్,అనంతుల రామ్మూర్తి గౌడ్ 9703306843 చెప్పిన విషయాన్ని బహుజన బంధువు బోర సుభాషన్న గుర్తు చేశారు.

కే పి హెచ్ బి 6 ఫేజ్ లోని మోడల్ మార్కెట్,సిబిసిపిడి కాలనీలోనీ మోడల్ మార్కెట్లు చెత్త కుప్పలుగా మందుబాబులకు అడ్డగోలుగా మారాయని సర్పంచుల సంఘం వ్యవస్థాపక నాయకుడు,బీసీ ముఖ్యమంత్రి నినాదం నిర్మాత ఆలంపల్లి రాంకోటి ముదిరాజ్ సెల్ నెంబర్:99126 93459 తెలిపిన విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ-సిపిఐ(ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి బోసన్న మంత్రి కేటీఆర్ కు వివరించారు.అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఆదర్శ మార్కెట్ల దీన స్థితి పై తక్షణమే విచారణ జరపాలని,మోడల్ మార్కెట్లను ఆధునీకరించి,అన్ని రకాల సౌకర్యాలతో నగర ప్రజలకు ఉపయోగపడే టట్లు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను సిపిఐ (ఎం-ఎల్) కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి,ప్రజాహితమే తన అభిమతంగా జీవిస్తున్న నిరాడంబర జీవి కామ్రేడ్ బోర సుభాషన్న ప్రజా సమస్యలపై వ్రాసిన బహిరంగ లేఖలో కోరారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారిన మార్కెట్లను తిరిగి ఆదర్శ మార్కెట్లుగా తీర్చిదిద్దుటకు ప్రభుత్వ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలు,ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని బోరన్న పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube