అయ్యో పాపం.. మెగా ఫ్యామిలీ కి.. అక్కడ అస్సలు కలిసి రావడం లేదా?

ఒకప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు ఉంటేనే సినిమాలు చూసేవారు ప్రేక్షకులు.కానీ ఇప్పుడు స్టార్ హీరోలను పట్టించుకోవడంలేదు.

 What Happened To Mega Family Movies Not Touching One Million Mark In Usa Market-TeluguStop.com

సినిమా కథలో బలం ఉందా లేదా అనేది చూస్తున్నారు.ఒకవేళ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ముక్కు ముఖం తెలియని హీరోకీ అయినా సరే సూపర్ హిట్ అందించి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం అన్న విషయం తెలిసిందే.

ఇకపోతే స్టార్ హీరోలు మంచి బలమైన కథతో వస్తే ఇక రికార్డులు తిరగ రాయడమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఎంతో సునాయాసంగా అమెరికన్ మార్కెట్లో వన్ మిలియన్ మార్క్ అందుకుంటున్నాయి.

చిన్న హీరోల సినిమాలు సైతం పాజిటివ్ టాక్ వచ్చి కథ బలంగా ఉంది అని తెలిస్తే చాలు యూఎస్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి.కానీ ఈ లిస్టులో చూసుకుంటే అటు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు మాత్రం కాస్త వెనకబడి పోయాయి అని తెలుస్తోంది.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పూర్తిగా నిరాశపరిచింది.

Telugu Acharya, Allu Arjun, Heros, Heroes, Chiranjeeiv, Pawankalyan, Ram Charan,

అయితే అటు అమెరికాలో వన్ మిలియన్ కు దగ్గరగా వచ్చింది.కానీ ఆ మార్క్ అందుకోలేకపోయింది.958 కే వసూళ్లతో చివరికి ఖాతా క్లోజ్ చేసింది.పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సైతం వన్ మిలియన్ టచ్ చేయలేక పోయింది అని చెప్పాలి.

సినిమాకి కేవలం 750 కే వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ మరింత ఘోరం.యూఎస్ బాక్సాఫీసు వద్ద 260 కే వసూళ్లతో పూర్తిగా డీలా పడిపోయింది.ఇదంతా చూసిన తర్వాత అటు మెగా ఫాలోయింగ్ అమెరికాలో ఎంతో బలహీనంగా ఉందన్న సందేహం కూడా తెర మీదికి వస్తున్నాయ్ అని చెప్పాలి.

ఇంతే కాదు అటు అల్లు అర్జున్ నటించిన సరైనోడు 888 కే తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube