శరీరాన్ని లోపలినుంచి శుభ్రపరుచుకోవాలంటే ఎలా?

How To Clean Your Body Inside?

మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం అంటే రోజుకి రెండుసార్లు స్నానం చేయడం, రెండుసార్లు బ్రష్ చేయడం, ముఖాన్ని ఓ రెండుసార్లు కడుక్కోవడం మాత్రమే కాదు.ఇదంతా బయటి కథే.

 How To Clean Your Body Inside?-TeluguStop.com

మనుషుల మధ్య ఇబ్బంది లేకుండా తిరగడానికి మనం చేసేది.కాని శరీరాన్ని లోపలి నుంచి కూడా శుభ్రపరుచుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది.

లేదంటే బయటకి కనబడకుండా మనల్ని హాస్పటల్‌ మంచం ఎక్కిస్తాయి మలీనాలు, టాక్సిన్స్.మరి శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరుచుకోవాలంటే ఎలా?

* నీళ్ళు బాగా తాగాలి అనే విషయం ఏళ్ళ కొద్ది, కొన్ని వేలసార్లు వినుంటారు.విని విని బోర్ కొట్టినాసరే .నీళ్ళ బాగా తాగాలి.ఎందుకంటే నీరే మలినాల్ని మూత్రం ద్వారా పోగొడుతుంది.ఓ సగటు యువకుడు 3.7 లీటర్లు, ఓ సగటు యువతి 2.7 లీటర్ల నీళ్ళు తాగాలి ప్రతీరోజు.

* పేరుకి తగ్గట్టుగానే వాటర్ మిలన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.దీంట్లో డైటరీ ఫైబర్ కూడా దొరుకుతుంది.ఇది టాక్సీన్స్ ని క్లీన్ చేస్తుంది.

* ఒంట్లో ఉండిపోయిన టాక్సిన్స్ బయటకి రావాలంటే ఫైబర్ కంటెంట్ ఒంట్లోకి వెళ్ళాలి.

సులువుగా దొరికే అరటిపండు, కష్టంగా దొరికినా, అవకాడో లాంటి ఫలాల్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

* ద్రాక్షపళ్ళలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఎక్కువ.

ఇది అనవసరమైన కొవ్వుని కూడా తీసేస్తుంది.

* ఆపిల్ సైడెడ్ వెనిగర్ టాక్సిన్స్ తొలగించడంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

ఇది డాక్టర్లు మెచ్చిన క్లీన్సెనర్.

* ఎక్కువ కాలరీలు ఉండే ఆహారం వద్దు.

టాక్సిన్స్ వీటివల్లే పెరిగేది.లైట్ ఫుడ్ ప్రిఫర్ చేయండి.

అలాగే సాధ్యమైనంతవరకు లోకల్ వెజిటబుల్స్, లోకల్ ఫ్రూట్స్ ని తీసుకోండి.ప్రాసేస్డ్ ఫుట్, క్యాన్డ్ ఫుడ్ జోలికి పోవద్దు.

* రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకోని తాగడం అలవాటు చేసుకోండి.ఇది టాక్సిన్స్ పై తీవ్రప్రభావం చూపుతుంది.

అలాగే ఉదయాన్నే కాఫీ, టీ మీద గ్రీన్ టీ తాగడం బెటర్.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube