సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పెడుతున్న పౌష్టికాహార వివరాలను,గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకుని,ఇద్దరు చిన్నారుల శరీరబరువు, రిజిస్టర్లను,హాజరుపట్టికను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.పిల్లలతో మమేకమై అక్షరాలు,రైమ్స్ వారితో చెప్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల మానసిక అంశాలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు.చిన్నారుల బరువు తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించి తదనుగుణంగా పోషక ఆహారాన్ని అందించాలని చెప్పారు.
అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్న పిల్లల బరువు,ఎదుగుదల తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో అర్బన్ సిడిపిఓ కిరణ్మయి,ఆయా జయమ్మ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







