సూర్యాపేట జిల్లా:పాలకులు మారినా సర్కార్ బడులు( Government schools ) తీరు మారడం లేదు.ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో శూన్యంగా కనిపిస్తుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ( Kodad ) పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిల అవస్థలు వర్ణతీతంగా మారాయని
తల్లిదండ్రులు వాపోతున్నారు.
650 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా కేవలం రెండు బాత్రూంలే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న రెండు బాత్రూములు కూడా సరిగ్గా ఉండవని, ఉదయం పూట టిఫిన్ కూడా సరిగ్గా పెట్టడం లేదని,వాటర్ సదుపాయం కూడా అరకొరాగానే ఉండడంతో బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని,తక్షణమే అధికారులు,ప్రభుత్వం స్పందించి పాఠశాలలో తగిన మౌలిక వసతులు కల్పించాలని,పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థిని తల్లిదండ్రులు లేవనెత్తారు.
అయినా నేటికీ చర్యలు లేవని వాపోతున్నారు.