అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగు వైద్యురాలు దుర్మరణం

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల అకాల మరణాలు, హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.తాజాగా అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్ధిని ప్రాణాలు కోల్పోయింది.

 Veterinary Doctor From Tenali Died In A Road Accident In America, Jetti Harika-TeluguStop.com

ఓక్లహోమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ పశువైద్యురాలు దుర్మరణం పాలైంది.మృతురాలిని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్‌కు చెందిన జెట్టి శ్రీనివాసరావు, నాగమణిల కుమార్తె జెట్టి హారిక( Jetti Harika )గా గుర్తించారు.

హారిక ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.అక్కడ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహోమాలో చదువుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఓక్లహోమాలోని జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొన్న ఘటనలో హారిక ప్రాణాలు కోల్పోగా.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Telugu America, Chandrasekhar, Jetti Harika, Road, Tenali, Veterinary-Telugu NRI

హారిక మరణవార్త ఆమె కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది.జీవితంలో గొప్ప స్థితికి చేరుకుంటుందనుకున్న కుమార్తె తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.హారిక మరణవార్తను వారు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు.

అలాగే తమ కుమార్తె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని ఏపీ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.తెనాలికే చెందిన టీడీపీ నేత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్( Chandra Sekhar Pemmasani ) .హారిక మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఎన్ఆర్ఐలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Telugu America, Chandrasekhar, Jetti Harika, Road, Tenali, Veterinary-Telugu NRI

కాగా .గత వారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్( Sai Surya Avinash ) (26) న్యూయార్క్ నగర సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతంలో మునిగి మృతిచెందిన సంగతి తెలిసిందే.నీటి ఉదృతికి అవినాష్ కాలుజారి జలపాతంలో కొట్టుకుపోయాడు.

అతడిని రక్షించేందుకు మరొకరు నీటిలో దూకగా అతను కూడా కొట్టుకుపోయాడు.అయితే రెస్క్యూ సిబ్బంది వేగంగా స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇతను ఎంఎస్ చేయడానికి గతేడాది అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube