సూర్యాపేట జిల్లా:స్త్రీ మూర్తి త్యాగాలు ఎనలేనివని, జాతీయత భావాన్ని,సొదరభవాన్ని పెంపొందించేలా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ అన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురష్కరించుకుని నేటి రక్షా బంధన్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయం నందు జాతీయ సమైక్యత సముహిక రక్షాబంధన్ గా నిర్వహించి సిబ్బందికి రాఖీలు కట్టడం జరిగినది.ఈ సందర్భంగా ఎస్పీకి మహిళా సిబ్బంది రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న అసాధారణ పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం నిర్వర్తించడంలో మహిళలు సిబ్బందికి అన్ని విధాలా సహకరించారని,అడువుల్లో ఉన్న తమ పోలీసు కొడుకు,భర్త,అన్న,తమ్ముడు క్షేమంగా ఉండాలని ప్రతి స్త్రీ మూర్తి కోరుకుంటుందని,స్ర్తీమూర్తి వల్లే ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం,రవి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు సోమ్ నారాయణ్ సింగ్,శ్రీనివాస్,ఆర్ఐలు శ్రీనివాసరావు,గోవిందరావు,ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు, సెక్షన్ సూపరింటెండెంట్,సెక్షన్ సిబ్బంది,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.