సూర్యాపేట జిల్లా:నిత్యం విధులు నిర్వర్తిస్తూ అవిశ్రాంతంగా పని చేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపడంలో భాగంగా ఈ నెల 3 వ,తేదీ నుండి 5 వ తేదీ వరకు జిల్లా పోలీస్ వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.క్రీడల నిర్వహణలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు శుక్రవారం మార్చ్ ఫాస్ట్ ప్రాక్టీస్ నిర్వహించగా ఎస్పీ,అదనపు ఎస్పీ ఎస్పీ రితిరాజ్ మార్చ్ ఫాస్ట్ ను పరిశీలించి,పర్యవేక్షణ చేశారు.ఈ సందర్భంగా వారు సిబ్బందితో మాట్లాడుతూ అందరూ క్రీడలను ఎంజాయ్ చేయాలని,క్రీడా స్పూర్తితో ఆటల్లో పాల్గొనాలని సూచించారు.3వ తేది ఉదయం 9 గంటలకు జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు పోలీసు వార్షిక క్రీడలు ప్రారంభిస్తారు.ఈ మార్చ్ ఫాస్ట్ నందు సీఐలు,ఆర్ఐలు,ఎస్ఐలు,క్రీడలు అడే సిబ్బంది పాల్గొన్నారు.




Latest Suryapet News