విభళాపురంలో ఎస్సారెస్పీ కాల్వకే ఎసరు పెట్టిన వైనం

సూర్యాపేట జిల్లా:మోతె మండలం( Mothey mandal ) విభళాపురం రెవెన్యూ పరిధిలో ఓ రైతు చేసిన ఘనకార్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.వ్యవసాయానికి సాగునీరు అందించే ఎస్సారెస్పీ కెనాల్ కట్టను ధ్వంసం చేసి,కాలువను కూడా పూర్తిగా పూడ్చివేసి మామిడి తోట సాగు చేస్తున్నాడు.

 Ssrsp Canal Damage In Vibhalapuram, Mothey Mandal , Srsp Canal , Farmers , S-TeluguStop.com

స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం… మోతె మండలం రాంపురంతండా నుండి విభళాపురం గ్రామం మీదుగా ఉన్న ఎస్సారెస్పీ 22ఎల్ కాలువ పాలేరు వాగులో కలుస్తుంది.

ఈ కాలువకు రెండు వైపులా 47 మీటర్లు రోడ్డు కోసం వదిలిపెట్టారు.

ఈ దారి గుండా రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం ట్రాక్టర్లు,ద్విచక్ర వాహనలు,ఎద్దుల బండ్లతో రాకపోకలు సాగిస్తుంటారు.కానీ,విభళాపురం గ్రామంలో ఉన్న ఎస్సారెస్పీ 22ఎల్ కాలువను దారితో సహా పూర్తిగా ఆక్రమించుకొని సదును చేసి మామిడి తోట సాగు చేస్తున్నారు.

ఇదేంటని చుట్టుపక్కల రైతులు ప్రశ్నిస్తే ఆ సంగతి ప్రభుత్వాధికారులు చూసుకుంటారులే,మీకేందుకని దబాయిస్తున్నారని,ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయకపోతే వచ్చేది వానా కాలం పంటల సాగు సీజన్ లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube