సూర్యాపేట జిల్లా:రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను పొదుపు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోపయ్య చారి ఎంటర్ప్రైజెస్ హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పోలోజు శారద అన్నారు.ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక హెచ్పీ గ్యాస్ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు ఎన్సీసీ విద్యార్ధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంధన వనరులు మానవ జీవితంలో నిత్యకృత్యమయ్యాయని,అవి లేని జీవితం వర్ణనాతీతమన్నారు.అందుకే నేటితరం వారు ఇంధనాన్ని పొదుపు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిందిగా కోరారు.
వీలైనంత వరకు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.అనంతరం ఇంధన పొదుపు చేసేలా అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పోలోజు మౌనిక,సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్,ఎన్సీసీ కెప్టెన్ వెంకటేషులు,కోదాడ ఎన్సీసీ అధికారి శ్రీనివాస్,గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ నాయక్,కాసర్ల సందీప్,సురేష్,ఎన్సీసీ విద్యార్థులు,డెలివరీ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు.