సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలోని గంగదేవమ్మ గుడి దగ్గర సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై తవ్విన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్థానికులు ఇంటి అవసరాల నిమిత్తం అనుమతులు లేకుండా తవ్వి పైప్ లైన్ వేసినట్లు,
తర్వాత దానిని పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది.
ఆర్ అండ్ బి అధికారులు స్పందించి గుంతను పూడ్చకపోతే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,రాత్రి వేళలో మరింత ప్రమాదకరంగా ఉండడంతో ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు.