సూర్యాపేట జిల్లా:చివ్వేంల మండలంలోని తిరుమలగిరి ప్రభుత్వ హైస్కూల్,ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సందర్శించారు.ముందుగా తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.
ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయుల గురించి జిల్లా విద్య శాఖ అధికారిని ఆరాతీశారు.పుస్తకాల పంపిణి, యూనిఫాం పంపిణి వివరాలను ప్రధానోపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు.
పదవ తరగతి బి-సెక్షన్ గదిని సందర్శించి విద్యార్థులతో తెలుగు పుస్తకం చదివించారు.అలాగే వంట గదిని పరిశీలించి మెనూ ప్రకారం కోసి ఉన్న కూరగాయలను పరిశీలించారు.
ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠాశాలను కూడా సందర్శించారు.నాలుగవ తరగతికి శ్రీదేవి టీచర్ పాఠం బోధిస్తున్న సమయంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పై విద్యార్దులను పలు ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు ఆంగ్లంలో ఏకలవ్య డ్రామాను కలెక్టర్ కి చేసి చూపించారు.అదే డ్రామాను తెలుగులో చేయాలని కలెక్టర్ కోరగా విద్యార్థులు తెలుగులో కూడా డ్రామాను వేసి చూపించారు.
పాఠశాల నిర్వహణపై ప్రధాన ఉపాధ్యాయురాలిని కలెక్టర్ అభినందించారు.తదుపరి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్న పిల్లలతో కలెక్టర్ ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శైలజ,ఉపాధ్యాయులు వెంకన్న,లలిత కుమారి, తదితరులు పాల్గొన్నారు.