సూర్యాపేట జిల్లా:గిరిజన తండాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామీణ అంతర్గత రోడ్లపై రాష్ట్ర నీటి పారుదల ఆహార పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారని పాలకవీడు మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మిగడం పహాడ్ తండా నుండి మఠంపల్లి మండలం కృష్ణాతండా వరకు మంజూరైన బీటీ రోడ్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు కోసం మంత్రి ఉత్తమ్ రెండు కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు.మారుమూల గిరిజన తండాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
ఎంతోకాలంగా రెండు గ్రామాలకు రోడ్డు నిర్మాణం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే రెండు కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోనే గిరిజన తండాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ తండాలను అభివృద్ధి చేసేందుకు మంత్రి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.అడగగానే నిధులు కేటాయించి బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డికి గిరిజనుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూపావత్ బాగా నాయక్, మూడు నాగు నాయక్, ధనావత్ రవి నాయక్, భూక్య శీను,ధనావత్ బాలూ,భూక్య పాండు, సైదు,చందు తదితరులు పాల్గొన్నారు.