రాజన్న సిరిసిల్ల జిల్లా : భూమిని ఒక వ్యక్తికి అమ్మి అదే భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు సహాయంతో మరి వ్యక్తికి అమ్మి బెదిరింపులకు పాల్పడిన సిరిగిరి రమేష్ అరెస్ట్ రిమాండ్ కి తరలించినట్లు తెలిపిన టౌన్ సి ఐ.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అశోక్ నగర్ కరీంనగర్ కు చెందినటువంటి బొద్దుల రాంనారాయణ వేములవాడ లోని నందికమాన్ ప్రాంతంలో, సిరిసిల్ల అంబేద్కర్ నగర్ చెందినటువంటి సిరిగిరి రమేష్ దగ్గర 2004 సంవత్సరంలో 200 చదరపుగజాల స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేసుకోగా గత నెల రోజుల క్రితం అతను తన ప్లాటు వద్దకు వెళ్లగా సిరిగిరి రమేష్ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి వేరే వారికి తన భూమిని విక్రయించాడని తెలిసింది.
దీని గురించి సిరిగిరి రమేష్ ని ప్రశ్నించగా తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించారు.అతని ప్లాట్ అతని కావాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు అతనికి భయపడి బొద్దుల రాoనారాయణ లక్ష రూపాయలు ఇచ్చాడు.
మరల మరో 50 వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు లేకుంటే తనని తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు.బొద్దుల రంనారాయణ పిర్యాదు మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.
సిరిగిరి రమేష్ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధించిన పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.