పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా జులై :ఉపాధి హామి పథకములో పండ్ల తోటల పెంపకం బుధవారం ఉపాధి హామి పథకములో పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయములోని అడిటోరియములో నిర్వహించారు.ఉద్యాన తోటల ( Horticulture )పైన ఉపాధి హామి, వ్యవసాయ, హార్టికల్చర్ జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అయిన యం.

 Awareness Program On Orchard Cultivation-TeluguStop.com

పి.డి.ఒలు, ఎ.పి.ఒలు, ఇ.సిలు, టి.ఎలు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులకు ఈ క్రింది విషయాలపై అవగాహన కల్పించడం జరిగినది.ఉపాధి హామి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వము( Telangana Govt ) పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఉద్యాన వన శాఖ మరియు వ్యవసాయ శాఖఆద్వర్యములో సన్న, చిన్న కారు రైతులకు రాయితీపై పండ్ల తోటల పెంపకానికి అవకాశము కల్పించింది.

ఈ పథకంలో భాగంగా ఉపాధి హామి జాబ్ కార్డు కలిగి ఉండి, అయిదేకరాలలోపు భూమి ఉండి, సాగు నీటి వసతి కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులు.

ఈ స్కీంలో పండ్ల తోటలతో పాటు, బిందు సేద్యమును కల్పిస్తారు.

ఎస్సి, ఎస్టి రైతులకు వంద శాతం, మిగిలిన సామాజిక వర్గాల రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు పంపిణి చేస్తారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పథకంలో 2023-24 సంవత్సరమునకుగాను 1040 ఎకరాల్లో పండ్ల తోటలు ఏర్పాటు చేయుటకు లక్ష్యముగా పెట్టారు.ఉపాధి హామి సిబ్బంది, వ్యవసాయ శాఖ ఏ ఈ ఓ ఎస్, ఉద్యాన శాఖ అధికారుల ఆద్వర్యములో లబ్దిదారులను గుర్తించి పండ్ల తోటల సాగుకు తగు చర్యలు తీసుకొనుటకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యములో జిల్లా యంత్రాంగం పని చేయడము జరుగుతుంది.

పథకం ముఖ్యాంశాలు:

ఉపాధి హామి పథకం జాబ్ కార్డ్( Job card ) లు కలిగి ఉండి, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న ఎస్సీ, ఎస్టి రైతులు, చిన్న, సన్నకారు రైతులను లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు.లబ్దిదారుడికి మట్టి నమూనా పరిశీలించి వారికి ఆయా పండ్ల తోటల సాగుకు తగు సూచనలు చేయడం జరుగుతున్నది.మట్టి నమూనా పరిశీలనకు చార్జీలు చెల్లిస్తారు.గుంతలు తీయడం, మొక్కలు నాటడం ఉపాధి హామి కూలీలతో చేయిస్తారు.బతికిన ప్రతి మొక్కకు మూడేండ్లపాటు నెలకు రూ.10/- చొప్పున వాచ్ అండ్ వార్డు కోసం చెల్లిస్తారు.డ్రిప్ ఇన్ స్టాలేషన్ కు అయ్యే ఖర్చు చెల్లిస్తారు.

దీనిలో ఎస్సీ, ఎస్టిలకు 100% సబ్సిడీ ఇస్తారు.చిన్న, సన్నకారు రైతులకు 90% సబ్సిడీ ఇస్తారు.

మొక్కల ఎరువులకు మూడేండ్లపాటు డబ్బులు చెల్లిస్తారు.ఒక్కో చెట్టుకు సంవత్సరానికి రూ.50/- చెల్లిస్తారు.ప్రతి లబ్దిదారునికి గరిష్టముగా ఐదు ఎకరాల వరకు మాత్రమె ఉండాలి.

లబ్దిదారులు మొక్కలకు ప్రభుత్వ నర్సరిల ద్వారా కాని రిజిష్టర్డ్ ప్రైవేటు నర్సరిల ద్వారా గాని కొనుగోలు చేయవచ్చు.

మూడు సంవత్సరాల వరకు సంరక్షణ బాధ్యత పండ్ల తోటల సంరక్షణ బాధ్యతకు మూడు సంవత్సరాల వరకు సంరక్షణ చార్జీలు చెల్లించడం జరుగుతుంది.మొక్కలకు మామిడికి రూ.30/-, బత్తాయి రూ.44/-, నిమ్మ రూ.25/-, సపోట రూ.37/-, జీడి పప్పు రూ.24/-, సీతాఫలం రూ.38/-, ఆపిల్ బేర్ రూ.51/-, దానిమ్మ రూ.24/-, కొబ్బరి రూ.36/-, జామ రూ.31/-, మునగ రూ.15/-, అల్లనేరేడు రూ.25/-, చొప్పున ఒక్కొ మొక్కకు చెల్లించనున్నారు.ఎరువులకు ఒక్కొ మొక్కకు రూ.50/- నిర్వహణ ఖర్చు కింద రూ.10/- చొప్పున చెల్లించడంతో పాటు ఉపాధి హామి కూలీలతో గుంతలు తవ్వకం, మొక్కలు నాటే పనులు చేపడతారు.మొక్కలు నాటిన ఏడాది నుంచి మొత్తం మూడేళ్ళ వరకు నిర్వహణ ఖర్చులు మంజూరు చేస్తారు.

13 రకాల తోటలు:

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లో సారవంతమైన నెలలు ఉన్నప్పటికీ అధిక పెట్టుబడి వ్యయం ఉండడము వలన సన్న, చిన్నకారు రైతులు ముందుకు రావడము లేదు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హమి పథకములో ఉద్యాన పంటలు సాగుకు పెద్దపీట వేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమములో భాగంగా ప్రస్తుతం మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, సపోట, జీడిపప్పు, మునగ, డ్రాగన్ ప్రూట్, అల్లనేరేడు, ఆపిల్ బేర్, దానిమ్మ, కొబ్బరి రకాల పంటల సాగు చేయాలని నిర్ణయించారు.

ఎంపిక విధానము:

వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ మరియు పంచాయతి రాజ్ సిబ్బంది గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్దిదారులను గుర్తించి మంజూరు చేయడం జరుగుతుంది.

గడువు తేదిలు:

లబ్దిదారుల ఎంపిక : 31 జూలై 2023 అంచనాలు రూపొందించడం : 15 ఆగస్టు 2023 డ్రిప్ ఇరిగేషన్ పనులు పూర్తి : 15 ఆగస్టు నుంచి 31 వరక గుంటలు తీసి, మొక్కలు నాటడం : 31 ఆగస్టు 2023ఈ కార్యక్రమములో బి .గౌతం రెడ్డి, డిఆర్ డి ఓ, సి.హెచ్.మదన్ మోహన్, అడిషనల్ డి ఆర్ డి ఓ , కె .నర్సింహులు, ఏ పి డి , భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి, జిల్లా హార్టికల్చర్ అధికారి, యం.పి.డి.ఒలు, ఎ.పి.ఒలు, ఇ.సి, టి.ఎలు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube