వృద్ధుడికి వీల్ చైర్ అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బానోత్ రూప్ సింగ్ అనే వృద్ధుడికి అనారోగ్య కారణాల వలన కుడికాలు చికిత్స చేసి తొలగించారు.అలాగే ఎడమకాలి బొటనవేలు మినహా అన్ని వేలు తొలగించగా, కలెక్టరేట్కు రావడం జరిగింది.

 A Giving A Wheelchair To An Old Man , Wheelchair , Yellareddypet, Rajanna Sirisi-TeluguStop.com

అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి పెన్షన్ రావడంలేదని సదరం సర్టిఫికెట్ రావడం లేదని పై అధికారులకు విన్నవించుకుందామని వచ్చామని తెలిపారు వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యంకు తెలియజేయగా వెంటనే డిఆర్డిఏ సిబ్బందితో మాట్లాడి సదరం ఆప్పిల్ కు లేక తీసుకోవడం జరిగింది.అలాగే అతనికి కదలికలో సమస్య ఉన్నందున జిల్లా సంక్షేమ శాఖ తరపున వీల్ చైర్ అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుడు రూప్ సింగ్  చాలా సంతోషం వ్యక్తం చేశారు.

తనకు పెన్షన్ రావడం లేదు దాని గురించి తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది.

ఆ సందర్భంలో నా పరిస్థితిని గమనించిన జిల్లా యంత్రాంగం జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యం వీల్ చైర్ ని ఉదారంగా అందించింది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలపడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube