సూపర్ స్టార్ కృష్ణ, ఎస్ వీ.రంగారావు గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకి( Super Star Krishna ) డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న పేరున్న సంగతి అందరికీ తెలిసిందే.అదేవిధంగా అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి( Sr NTR ) ధీటైన నటుడిగా ఎస్ వీ.రంగారావు గారికి మంచి పేరుంది.అలాంటి వీరిద్దరి మధ్య ఓ ఛాలెంజ్ చేసుకొనే అవకాశం ఎక్కడ వచ్చిందో తెలియాలంటే ఈ పూర్తి కధనం చదవాల్సిందే.
అప్పట్లో ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త ప్రయోగం చేయాలన్నా సూపర్ స్టార్ కృష్ణ ముందు ఉండేవారు.ఆయనలాగా అప్పటి తరంలో ఉన్న ఏ హీరో కూడా అంత ధైర్యం చేసేవారు కాదని ఎన్నో సందర్భాలలో ప్రముఖులు చెప్పిన సందర్భాలు అనేకం.
10 ఏళ్లలో 100 కి పైగా సినిమాలు చేసిన రికార్డ్ తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం కృష్ణకి మాత్రమే ఉందంటే అర్ధం చేసుకోవచ్చు.అందుకే ఆయన 350 పైచిలుకు సినిమాలలో నటించారు.
హీరోగా మంచి క్రేజ్ మీదున్న కృష్ణ ఆ తర్వాత తన సోదరులతో కలిసి నిర్మాణ సంస్థను.స్టూడియోను ప్రారంభించి సొంతగా సినిమాలు కూడా నిర్మించేవారు.
ఈ క్రమంలోనే పండంటి కాపురం సినిమాను( Pandanti Kapuram ) నిర్మించారు కృష్ణ.సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మల ఇందులో జంటగా నటించారు.
ఈ సినిమాను హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన సునెహ్రా సన్సార్ అనే సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు.బాలీవుడ్ లో ఈ సినిమా ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో తెలుగులో కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమాకి ఓ మేకప్ మేన్ గా పనిచేసిన మాధవరావు గారు( Makeup Man Madhava Rao ) ఓ సందర్భంలో వెల్లడించారు.ఇందులో నటించిన ఎస్ వీ రంగారావు గారు( SV Rangarao ) ఓ రోజు ఎక్కువగా తాగడం వలన షూటింగ్ కి రాలేదట.అప్పటికే సెట్‌లో కృష్ణ, విజయ నిర్మళ, గుమ్మడి, అంజలీ దేవీ, జమున, ప్రభాకర్ రెడ్డి, బి.సరోజా దేవీ.ఇలా ప్రధాన తారాగణం ఆయన కోసం ఎదురు చూస్తున్నారట.కానీ ఆయన రాకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది.

దాంతో ఈ విషయం సెట్ లో ఉన్న వాళ్ళకి తెలిసి ఇబ్బంది పడ్డారట.చాలామంది గుమ్మడి గారు మీద కోపంతో వూగిపోయారట.హీరో కృష్ణ గారు మాత్రం ఆయనకి ఇచ్చిన పాత్రను మరెవ్వరూ చేయలేరని, ఆయన వచ్చినపుడే షూటింగ్ పెట్టుకుందామని పేకప్ చెప్పారట.అంత నమ్మకం పెట్టుకున్న కృష్ణగారితో ఆ మరుసటి రోజు ఎస్ వీ రంగారావు తాను చేసిన పనికి సిగ్గు తెచ్చుకుంటూ అలా మరెప్పుడు చేయనని, కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి ఇక అప్పటినుండి తాగడం మానేసాడట!
.