ప్రస్తుతం ఉష్ణోగ్రతను తగ్గిపోయి చలి తీవ్రత బాగా పెరిగిపోయింది.దీనివల్ల ప్రజలు ఉదయం పూట త్వరగా నిద్ర లేచి బయటకి రాలేకపోతున్నారు.
చలికాలంలో చలి ఒక్కటే కాకుండా ఎన్నో వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సమస్య మరి పెరిగే అవకాశం ఉంది.
చలి ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది.దీని వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
చలికాలంలో దాదాపు 20 నుంచి 30% మంది గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రి చేరుతున్నారు.అయితే చలికాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారపు మార్పులతో పాటు వైద్యులు సూచించే కొన్ని నియమాలను కచ్చితంగా పాండించడం మంచిది.
ఇంకా చెప్పాలంటే గుండెపోటుకు వాయు కాలుష్యం కూడా ప్రధాన కారణమే, పొగ, వాయు కాలుష్యం వల్ల చలికాలంలో శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే చలికాలంలో అంటూ వ్యాధులు కూడా ప్రజలలో పెరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా మనకు తెలిసిన వారిలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే వారిని వాయు కాలుష్యానికి దూరంగా ఉంచడం మంచిది.ఎందుకంటే పొగ వారి గుండె సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే చలికాలంలో పొగ మంచు వల్ల సూర్యకాంతి కాస్త తగ్గుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం మంచిది.దీనికోసం కోట్, స్వెటర్, దుప్పటి మొదలైనవి వాడి శరీరాన్ని చలి నుంచి రక్షించడం మంచిది.దీని వల్ల శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు.
చలికాలంలో చాలామందికి ఎక్కువగా చెమట రాదు.కాబట్టి నీరు, ఉప్పు తీసుకోవడం కాస్త తగ్గించడం మంచిది.
ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగులకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉంటే తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది.కానీ ఇటువంటి వారు వైద్యుల సలహా తీసుకొని వ్యాయామం చేయడం మంచిది.
చలి ఎక్కువగా ఉంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామం చేయాలి.క్రమం తప్పకుండా మందులు ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యులు ఇచ్చిన మందులు మాత్రమే ఉపయోగించాలి.