స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ హెయిర్ ఫాల్ సమస్య సతమతం చేస్తూనే ఉంటుంది.అయితే కొందరిలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్కు అడ్డుకట్ట వేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకవేళ మీరు కూడా ఈ జాబితాలో కనుక ఉంటే.
అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ని ఫాలో అయితే మీ జుట్టు రాలనే రాలదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక ఫ్రెష్ అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మరియు గుప్పెడు తులసి ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలోవెరా జెల్ మరియు తులసి ఆకులు వేసుకుని అర కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేయాలి.తల స్నానం చేయడానికి గంట ముందు ఈ జ్యూస్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే కుదుళ్ళు బలోపేతం అవుతాయి.దీంతో జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.