తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన 2023 సంవత్సరం క్యాలెండర్ ను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి శుక్రవారం విడుదల చేశారు.పోయిన సంవత్సరం ముద్రించిన ఈ క్యాలెండర్ లకు డిమాండ్ ఎక్కువగా రావడంతో ముఖ్యమైన అన్ని పట్టణాలలో విక్రయాలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు చైర్మన్ ఆదేశించారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తదితర ముఖ్య నగరాల్లో టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల్లో క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతామని కూడా చెప్పారు.
తిరుమలలోని చైర్మన్ క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, పిఆర్ఓ డాక్టర్ రవి, ప్రెస్ ప్రత్యేక అధికారి రామారాజు పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు.రాష్ట్రపతి శ్రీశైలానికి వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రాష్ట్రపతి భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాలయ అధికారులు చెబుతున్నారు.రాష్ట్రపతి ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు సున్నిపెంటకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలంకి వస్తారు.

మార్గం మధ్యలో సాక్షి గణపతి దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.ఆ తర్వాత శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటారు.ఆ తర్వాత ప్రసాద్ పథకం కింద 43 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశం ఉంది.మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషములకు రాష్ట్రపతి పర్యటన ముగిసే అవకాశం ఉంది.
రాష్ట్రపతి పర్యటన దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం సమీపంలోని శిఖరాశిపురం, లింగాల గట్టు వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది.శ్రీశైలం వచ్చే వాహనాలకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అనుమతి లేదు.
DEVOTIONAL