సీతానవమిని( Seethanavamini ) సీతా జయంతి లేదా జానకి నవమి అని కూడా అంటారు.ఇది శ్రీరాముని( Lord Rama ) ధర్మపత్ని సీతాదేవి జన్మదినంగా ప్రజలు జరుపుకుంటారు.
హిందూ ధర్మం ప్రకారం శ్రీరామనవమికి నెల రోజుల తర్వాత వైశాఖమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిధి రోజు సీతమ్మ జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి.రాముడు కూడా ఇదే తిదిలో చైత్రమాసంలో జన్మించాడు.
ప్రత్యేక పూజలతో సీతారాములను భక్తులు ఆరాధిస్తున్నారు.ముఖ్యంగా వివాహం మైన మహిళలు ఈ రోజున సీతమ్మను భక్తులతో పూజిస్తారు.
ఇది వారి భర్తలకు దీర్ఘాయుష్షును, జీవితంలో గొప్ప విజయాలను అందిస్తుందని చాలామంది నమ్ముతారు.అంతేకాకుండా అవివాహితులు లేదా వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న యువతీ యువకులు( Young men , women ), సీతానవమి రోజున సీతారాములను పూజిస్తే వీరి ఆశీర్వాదంతో త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తులు నమ్ముతారు.

వైవాహిక బంధం( Marital relationship ) దృఢంగా ఉండడం కోసం కూడా సీతారాములను పూజిస్తారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజు శ్రీరాముడు లక్ష్మణుడు మారుతీ సమేతంగా సీతాదేవిని పూజిస్తారు.చిన్న పూజ మండపాన్ని ఏర్పాటు చేసి రంగురంగుల పూలతో అలంకరించి సీతారాములను, జనక మహారాజు, తల్లి సునయన విగ్రహాలను కొలువు తీర్చి పూజిస్తారు.భూమిని దున్నుతుండగా సీతాదేవి ఉద్భవించినందున ఈ రోజున భూమాతను కూడా పూజిస్తూ ఉంటారు.
భక్తులు నువ్వులు, పరమాన్నం, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.హారతి పూర్తయిన తర్వాత ప్రసాదం పంచుతారు.
ఈ రోజున కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.సీతా చాలీసా ను పాటిస్తారు.
సీతా వ్రతం ఆచరించడం వల్ల సీతమ్మ లో ఉన్న ప్రేమ గుణం, త్యాగ గుణం, అంకిత భావం, స్వచ్ఛత, పవిత్రత లాంటి గుణాలు లభిస్తాయి.ఈ సద్గుణాలే రక్షణ కవచంగా నిలుస్తాయని నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే వైశాఖ నవమి తిథి ఏప్రిల్ 28న సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిషానికి మొదలై ఏప్రిల్ 29న సాయంత్రం 6.22 నిమిషములకు ముగుస్తుంది.ఏప్రిల్ 29వ తేదీ శనివారం ఉదయ తిథిలో సీత నవమి పర్వదినాన్ని జరుపుకుంటారు.