ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాక్సాఫీస్ వద్ద ఏజెంట్( agent ) సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సినిమా కలెక్షన్లలో పెద్దగా మార్పు ఉంటుందని భావించలేం.తొలిరోజు ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.35 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సిన ఈ సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం కనిపించడం లేదు.
అయితే ఏజెంట్ వైల్డ్ సాలా అనే ట్యగ్ లైన్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందె.అయితే సాలా అంటే హిందీలో బావమరిది అనే అర్థం కాగా కొంతమంది ఈ పదాన్ని మరో విధంగా అర్థం చేసుకుంటున్నారు.
మొదట లైగర్ ( Liger )సినిమాతో ఈ పదం ఎక్కువగా పాపులర్ అయింది.సాలా క్రాస్ బ్రీడ్( Sala cross breed ) అనే పదాన్ని ఈ సినిమా కోసం ఎక్కువగా వినియోగించారు.
లైగర్ సినిమా కూడా భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

సాలా పదం వాడిన రెండు సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ పదం సినిమాలలో వాడకుండా ఉంటే మంచిదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో నిర్మాతలు కాంబినేషన్లను నమ్మి సినిమాలు తీయకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సినిమాలు భారీ నష్టాలను మిగిల్చితే మాత్రం నిర్మాతలు కోలుకోవడం సులువు కాదు.పెద్ద సినిమాలు ఇచ్చిన షాకుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతల సంఖ్య కూడా తక్కువేం కాదు.అందువల్ల హీరోలు, దర్శకులు కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్ రిజల్ట్ పై అక్కినేని హీరోలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







