కామారెడ్డి( Kamareddy ) నుండి కరీంనగర్ వెళ్తుండగా చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్.లక్ష రూపాయల నగదు సీజ్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల( Rajanna Sirisilla District )- కామారెడ్డి రెండు జిల్లాల సరిహద్దుల్లో పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద KA 27M 9264 అనే నంబర్ గల కారు లో కామారెడ్డి నుండి కరీంనగర్( Karimnagar ) వైపు వెళ్తున్న కారును పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద ఆపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందము ఆపి తనిఖీ చేయగా కారు లో ఉన్న సయ్యద్ ఖలీమొద్దిన్( Syed Kalimuddin ) వద్ద నుండి లక్ష రూపాయల నగదు ను పట్టుకున్నారు.
స్వాదీనం చేసుకున్న నగదును జిల్లా ట్రెజరీ కార్యాలయం కు అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్( Flying Squad ) అధికారులు తెలిపారు.