రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని పురష్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో, ఉమ్మడి మానల లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ పేర్చి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆటపాటలతో అడుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గడచినా నాలుగేళ్లలో గ్రామంలో చేపట్టి పూర్తి చేసినా పలు అభివృద్ధి పనులను పల్లె ప్రగతి పనులను ప్రజలకు వినిపించారు.పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా స్మశానా వాటిక, ఎరువు తయారీ తడి చెత్త పొడి చెత్త వేరు చేయుటకు షెగ్రగేషన్ షెడ్డు నిర్మాణం,నర్సరీ ఏర్పాటు, గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం కోసం విలేజ్ పార్క్ ఏర్పాటు చేసామని గ్రామస్థులకు తెలియజేసారు.
గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ ట్రాలి టాంకర్ లను కొనుగోలు చేసి ఇంటింటికి చెత్త బుట్టల పంపిణి చేశామని గ్రామస్థులు ఇంటి వద్దనే చెత్త ను తడి పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కీ అందించాలని సూచించారు.గ్రామంలో వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలనీ సఫాయి కార్మికులను గౌరవంగా చూడాలని వారు గ్రామస్థులకు పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమం లో సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్,మానాల సర్పంచ్ అల్లూరి మానస తిరుపతి, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీణయ్య, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, ప్రజాప్రతినిధులు,మహిళాలు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.







