ఏపీలో కొనసాగుతున్న అరాచక రాజకీయాలను తమ జనసేన అడ్డుకుంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమంలో భాగంగా ఆయన 34 అర్జీలను స్వీకరించారు.
ప్రజల దగ్గరకు వెళ్తేనే వారి సమస్యలు తెలుస్తాయని పవన్ తెలిపారు.రాష్ట్రంలో ఎనిమిది రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.కులాల వారీగా విడిపోవద్దన్న జనసేనాని అందరూ ఒక్క తాటిపైకి రావాలని సూచించారు.







