రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట( Malkapet ) గ్రామానికి చెందిన రైతులు మంగళవారం పత్రిక ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మల్కపేట గ్రామంలో ఉన్న ఊర చెరువులోకి కాలేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram project ) యొక్క తొమ్మిదవ ప్యాకేజీ కుడి కాలువ ద్వారా చెరువులో నీటిని నింపుతున్నారు.
అందులో ఉన్న మా యొక్క పంట పొలాలు పట్టా భూములు లావణి పట్టా 45 ఎకరాల భూములు నీట మునిగి పోయినవి గత 5 సంవత్సరాల నుండి నీటితో నింపుతున్నారు.
ఇలా నింపడం వల్ల మాకు పంటలు పండించుటకు ఎలాంటి మార్గం లేకపోవడం తో చాలా నష్టపోతున్నామని సంబంధిత అధికారుల ద్వారా మోకపైన సర్వే చేయించగలరని గత 5 సంవత్సరాల నుండి ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు ఇచ్చినా ఎవ్వరు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని , త్వరలో మల్కాపేట రిజర్వాయర్( Malkapeta Reservoir ) ప్రారంభించడానికి ఎవరు వచ్చిన అడ్డుకోవడానికి మల్కపేట రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామని మల్కాపేట రైతులు తెలిపారు.
నష్ట పరిహారం చెల్లించిన తర్వాతనే రిజర్వాయర్ ప్రారంభించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు వేల్పుల ఆనందం,కర్రోళ్ల శంకర్,తీపిరి శ్రీను,ఎక్కలదేవి శ్రీనివాస్, ఎక్కలదేవి హరీష్, ఎలగందుల హరీష్,కర్రోళ్ల మోహన్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.