కలెక్టర్ కు వినతి పత్రం అందించిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్)2024 కి సంబదించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమే అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ గత నెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ సందర్భంగా ఈ సారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడం తో నిరుద్యోగుల పైన ఫీజు భారం మోపడమే అవుతుందని మండిపడ్డారు.టెట్ పరీక్ష ఫీజు గత ప్రభుత్వంలో 2021 లో 200 రూపాయలు.2022 లో 300 రూపాయలు .గత ఏడాదిలో రెండు పేపర్లు గాను లో 400 రూపాయలు నిర్ణయించడం జరిగింది.ఈ సంవత్సరం నోటిఫికేషన్ లో ఒక పేపర్ కి దరఖాస్తు చేసుకుంటే వెయ్యి,రెండు పేపర్లు కి దరఖాస్తు చేసుకుంటే రెండు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది అని,ఒకే సారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలకు గురి అవుతారని,ప్రభుత్వం నిరుద్యోగుల పైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారన్నారు.ఇలాంటి వైఖరి సరికాదు అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాక ముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోకవడం ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనం అని, కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం సిగ్గుచేటు అని,నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు.ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని ఫీజుల పేరుతో నిరుద్యోగుల పైన భారం మోపడమెన? ఫీజులు 150%నుండి300% టెట్ పరీక్ష ఫీజుల పెంపు పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది .లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని నిరుద్యోగుల ఆగ్రహానికి రాష్ట్ర వ్యాప్తంగా గురి కాక తప్పదు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు రుద్రవేణి సుజిత్ కుమార్, గౌరీ రాకేష్, కోడం వెంకటేష్, సురా రంజిత్, పోతల వంశీ, ఒగ్గు అరవింద్ తదితరులు పాల్గొన్నారు