రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం రోడ్డెక్కిన యాదవులు

రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం రోడ్డెక్కిన యాదవులు జిల్లా పశు వైద్యాధికారి హామీతో ఆందోళన విరమణ.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ( Gambhiraopet )మండలంలోని కొళ్ళమద్ది గ్రామానికి చెందిన యాదవుల కుటుంబాలు రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

 The Second Phase Will Be Road Trips For The Distribution Of Sheep , Sheep, Gambh-TeluguStop.com

గ్రామంలో 28 మంది యాదవులు డిడి లు రెండవ విడత గొర్రెలను తీసుకోవడానికి కట్టామని కట్టి కూడా మూడు నెలలుగా ఎదురుచూస్తున్నాం అని ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న దృష్ట్యా రెండవ విడత గొర్రెలు వస్తాయో రావో అని నమ్మకం లేదు అని ఆందోళన చేసిన యాదవులు తెలిపారు.ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న మండల పశు వైద్య అధికారి శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా పశు వైద్య అధికారి కొమురయ్య తో పోన్ లో మాట్లాడించారు.

త్వరలో డిడి లు కట్టిన వారందరికీ రెండవ విడత గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ సోదరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube