దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దోంగల ముఠా అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దోంగల ముఠా అరెస్ట్.వివరాలను వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 Inter-state Thieves Gang Has Been Arrested For Committing A Series Of Thefts In-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో ఉంటున్న హుస్నాబాద్ కి చెందిన శివరాత్రి సంపత్ అనే వ్యక్తి బావుల పూడిక, మట్టి పని చేసుకుని జీవిస్తాడు.ఎలాగైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకుని 2024 సంవత్సరం మే నెలలో ముస్తాబద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గల పెద్దమ్మ గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, తులాల వెండి మట్టెలు దొంగలించాడు.

మరుసటి రోజు ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో గల గొర్ల షెడ్డు నుండి రెండు గొర్లను దొంగలించాడు.

సంపత్ తో గతంలో పని చేసిన అగ్రహారంకు చెందిన అల్లిపు పరుశురాం సిరిసిల్ల లో పరిచయం కాగా సంపత్ పరుశురాంతో దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుదామని చెప్పగా అందుకు పరశురాం ఒప్పుకోగా ఇద్దరు కలిసి దేవాలయాల్లో దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని చందుర్తి డ్యామ్ వద్ద గల దుర్గమ్మ ఆలయం, హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో బైక్, కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం, బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లిలో గల పెద్దమ్మ ఆలయం, వేములవాడ రూరల్ మండలం వట్టెంలా గ్రామంలోని పెద్దమ్మ ఆలయం, టెక్స్టైల్ పార్కులోని పెద్దమ్మ ఆలయం,ఇల్లంతకుంట వంతడుపుల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం, బోయిన్పల్లి మండలం మల్లాపూర్ వద్ద సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం,

వేములవాడ చెక్కపల్లిలోని పెద్దమ్మ ఆలయం, కరీంనగర్ రోడ్ లో గల ఓద్యారం గుట్టపై గల రామాలయం, అల్గునూర్ లోని ఎల్లమ్మ ఆలయం,వట్టెంలా గ్రామంలో గల ఎల్లమ్మ ఆలయం, నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడగా సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్ సిబ్బంది తో స్పెషల్ టీమ్ ఏర్పటు చేసి దర్యాప్తు చేపట్టగా సోమవారం ఉదయం పొత్తూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని దొంగతనాలకి ఉపయోగించిన ఇనుప రాడ్, బైక్, మొబైల్ ఫోన్స్, 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనపరుచుకొని ఇద్దరు నిందుతులను రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

నిందుతులపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 కేసులు, జగిత్యాల జిల్లాలో 02 కేసులు, కరీంనగర్ లో 02 కేసులు, సిద్దిపేట జిల్లాలో 01 కేసులు నమోదయ్యాయని తెలిపారు వివిధ జిల్లాలో దేవాలయాల్లో వరుస దొంగతలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మధు ,చంద్రశేఖర్ లను ఎస్పీ అభినందించారు.ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube