విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.16 లక్షల అంచనాతో ఎనిమిది టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద పలు ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల మరమ్మతు పనులు చేయించిందని తెలిపారు.ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేయించామని వివరించారు.

 The Aim Is To Provide Better Facilities In Schools, , Better Facilities , School-TeluguStop.com

అనంతరం ప్రభుత్వ విప్, కలెక్టర్ తో కలిసి కస్తూర్బా గాంధీ విద్యాలయ ఆవరణంలో పరిశీలించారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని పాఠశాల విద్యాలయం బాధ్యులను ఆదేశించారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటూ బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని పేర్కొన్నారు.

అనంతరం వారిద్దరు కలిసి వేములవాడ- కోరుట్ల ప్రధాన రహదారిలో నిర్మాణంలో ఉన్న మర్రిపల్లి వంతెన పనులను పరిశీలించారు.పనులను త్వరితగతిన చేపట్టి వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు.

పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఇక్కడ పంచాయతీరాజ్ ఈ ఈ సూర్య ప్రకాష్, జిల్లా అధికారులు, కస్తూర్బా గాంధీ విద్యాలయం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube