రాజన్న సిరిసిల్ల జిల్లా: మెక్కుతుర్రు పైసలు అడుగుతే ఇవ్వకుండా గొడవలకు దిగుతున్నారని ఉమ్మడి మండలానికి చెందిన ఓ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండల ( Yellareddypet )కేంద్రంలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో( Fast food center ) ఫుడ్ తిని పైసలు అడుగుతే ఉద్దెర రాసుకో అంటూ హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒక్కొక్కరు 5వేలు, 3వేలు,2వేల చొప్పున ఉద్దెర్లు పెట్టి వెళ్తున్నారని అట్టి పైసలు ఇవ్వమని అడుగుతే కోపంతో చూస్తూ గొడవకు దిగుతున్నారని పేర్కొన్నారు.పొట్టకూటి కోసం కోటి విద్యలో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నడుపుకుంటున్నానని మాస్టారులకు జీతాలు, షట్టర్ కు కిరాయిలు చెల్లించాలంటే మాకు పెను భారం అవుతుందని అన్నారు.