పిడుగుపాటుకు గురైన గొర్రెల కాపరి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి కి చెందిన బొల్లారం ఎల్లయ్య యాదవ్ ( 51 )అనే గొర్రెల కాపరి పిడుగు పాటుకు గురయ్యాడు.గురువారం నాలుగున్నర గంటల ప్రాంతంలో తిమ్మాపూర్ శివారులోని జాల కింద ఏరియాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ( Heavy rain )లో పిడుగు పడింది.

 A Shepherd Struck By Lightning , Lightning, Shepherd ,rajanna Sirisilla Distric-TeluguStop.com

ఈ సంఘటనలో ఆయన పిడుగుపాటుకు గురి అయ్యాడు.ఎల్లయ్య చాతిలో ఎడమ భాగం కాలి పోయి అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోగా ఆయనను సమీపంలో ఉన్న రైతులు , మాజీ సర్పంచ్ రవి గుప్తా లు కలిసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

ఆయనకు వైద్య బృందం చికిత్స చేస్తున్నారు.ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

ఈదురు గాలులతో కూడిన వర్షంలో సమీపంలో పిడుగు పడినప్పుడు ఆయన గొర్రెలను మేపుతూ ఉన్నాడని తాము సమీపంలో కిలోమీటర్ దూరంలో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు దండు శ్రీనివాస్ తెలిపారు.ఆయనకు భార్య రేణుక,కూతురు శిరీషా, కుమారుడు శ్రీనివాస్ లు ఉన్నారు.

తన భర్త ఎల్లయ్య దేవుని దయ వల్ల క్షేమంగా పిడుగుపాటు నుంచి ప్రాణాలతో బయటపడ్డాడని అతని భార్య రేణుక , కుమారుడు శ్రీనివాస్ స్థానిక విలేకరులకు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube