చోరీ కేసులో నిందుతురాలికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వృద్ధురాలిని నమ్మించి బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందుతురాలికి మూడేళ్ల జైలు శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్.ఐ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివరాల మేరకు 9 మే 2023 న ముస్తాబాద్ మండలం నామాపూర్ కి చెందిన జంగటి లక్ష్మి(80) ఇంట్లో ఒంటరిగా వుండగా గంభీరావుపేటకి చెందిన పాటి సునీత, లక్ష్మికి మాయ మాటలు చెప్పి బంగారు అభరణాలు తీసుకొని పరారయ్యింది.

 Accused In Theft Case Sentenced To Three Years Imprisonment And Rs 2000 Fine, Ac-TeluguStop.com

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు పాటి సునీతను రిమాండ్ కి తరలించి, కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా సి ఎమ్ ఎస్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్,కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాగా, ప్రాసిక్యూషన్ తరుపున కోర్టులో పి.పి.సందీప్ వాదించగా, కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితురాలికి సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ ముడు సంవత్సరాల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా శిక్ష విధించినట్లు ముస్తాబాద్ ఎస్.ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube