చోరీ కేసులో నిందుతురాలికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వృద్ధురాలిని నమ్మించి బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందుతురాలికి మూడేళ్ల జైలు శిక్ష తో పాటు రూ.

2000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్.

ఐ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివరాల మేరకు 9 మే 2023 న ముస్తాబాద్ మండలం నామాపూర్ కి చెందిన జంగటి లక్ష్మి(80) ఇంట్లో ఒంటరిగా వుండగా గంభీరావుపేటకి చెందిన పాటి సునీత, లక్ష్మికి మాయ మాటలు చెప్పి బంగారు అభరణాలు తీసుకొని పరారయ్యింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు పాటి సునీతను రిమాండ్ కి తరలించి, కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా సి ఎమ్ ఎస్ ఎస్.

ఐ శ్రవణ్ యాదవ్,కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాగా, ప్రాసిక్యూషన్ తరుపున కోర్టులో పి.

పి.సందీప్ వాదించగా, కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితురాలికి సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ ముడు సంవత్సరాల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా శిక్ష విధించినట్లు ముస్తాబాద్ ఎస్.

ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

పవన్ అన్నప్రాసన సమయంలోనే అలాంటి పని చేశాడా.. సీక్రెట్ రివీల్ చేసిన అంజనాదేవి?