వేసవి కాలం వచ్చేసింది.వస్తూ వస్తూనే తనతో పాటు ఎన్నో సమస్యలను మోసుకు వస్తోంది.
అయితే వేసవి కాలంలో అత్యధికంగా వేధించే సమస్య అధిక దాహం.ఎంత నీరు తీసుకున్నా దాహం వేస్తూనే ఉంటుంది.
దాంతో ఈ సమస్యను వదిలించుకోవడం కోసం చాలా మంది కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్, టీ, కాఫీ వంటి వాటిని తీసుకుంటారు.కానీ, ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు.
పైగా ఇవి శరీరాన్ని డీహైడ్రేటెడ్‌గా మారుస్తాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను తీసుకుంటే అధిక దాహానికి చెక్ పెట్టవచ్చు.
మరియు ఎన్నో ఆరోగ్య లాభాలునూ పొందొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ డ్రింక్ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.? తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బీట్‌రూట్ తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న బీట్‌రూట్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, చిన్న అల్లం ముక్క, కొన్ని పుదీనా ఆకులు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ నుండి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు, చిటికెడు నల్ల ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు జీలకర్ర పొడి వేసి విస్కర్ సాయంతో కలుపుకోవాలి.
ఆపై ఇందులో రెండు గ్లాసుల వాటర్, ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీట్‌రూట్ జ్యూస్ వేసి మళ్లీ విస్కర్‌తో బాగా కలుపుకుంటే బీట్‌రూట్ బటర్‌మిల్క్ సిద్ధం అవుతుంది.
వేసవి కాలంలో ఈ బీట్‌రూట్ బటర్‌మిల్క్‌ను రోజుకు ఒక గ్లాస్ చప్పున తాగితే అధిక దాహం సమస్యకు దూరంగా ఉండొచ్చు.బాడీ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.శరీరం డిటాక్స్ అవుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు నీరసం, అసలట, తలనొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.