ప్రెగ్నెన్సీ టైమ్‌లో ములక్కాయ‌ తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే?

గ‌ర్భం దాల్చ‌డం అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళ‌కు ఎంతో సంతోషాన్ని అందిస్తుంది.నిజ‌మే క‌దా.

 What Happens Of Eating Drumstick During Pregnancy! Drumstick, Pregnancy, Eating-TeluguStop.com

తాను మ‌రో జీవికి ప్రాణం పోస్తున్నానంటే ఏ మ‌హిళ‌కైనా ప‌ట్ట‌రాని ఆనందం క‌లుగుతుంది.ఈ క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతో సంతోషంగా ఎదుర్కొంటుంది.

ఇక త‌న బిడ్డ ఆరోగ్యంగా, అందంగా పుట్టాల‌ని ప‌రిత‌పిస్తుంటుంది.అయితే అలా పుట్టాలంటే ప్రెగ్నెంట్‌గా ఉన్న స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఆహారం విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకోవాలి.అలాగే కొన్ని ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి.

అలాంటి వాటిలో ముల‌క్కాడ కూడా ఒక‌టి.అవును, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.కానీ, ఇది నిజం అంటున్నారు నిపుణులు.వాస్త‌వానికి ముల‌క్కాయ‌‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

విట‌మిన్ బి6, విట‌మిన్ బి12, విట‌మిన్ సి ముల‌క్కాయ‌‌లో ఉంటాయి.అలాగే ఐరన్‌, కాల్షియం, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముల‌క్కాయలో ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటుగా ఆల్ఫా-సిటోస్టెరాల్ కూడా ఉంటుంది.

ఇది గర్భిణీ స్త్రీలకు హాని చేస్తుంది.ఒక్కోసారి దీని వ‌ల్ల గర్భస్రావం కూడా జరగవచ్చు.

అయితే ముల‌క్కాయ‌ను పూర్తిగా మానేయాల్సిన అవ‌స‌రం లేదు.అప్పుడ‌ప్పుడు తీసుకోవ‌చ్చు.

కానీ, అతిగా మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తిన‌కూడ‌దు.అంత‌గా తినాల‌నిపించిన‌ప్పుడు‌ ముల‌క్కాయ బ‌దులుగా మున‌గాకు తీసుకుంటే.

గ‌ర్భిణీ స్త్రీకు, క‌డుపులోని బిడ్డ‌కు ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బొప్పాయి, క‌ల‌బంద‌, పైనాపిల్‌, పీత‌లు, మొలకెత్తిన బంగాళదుంప‌లు, నువ్వులు, కెఫిన్ ఉండే ప‌దార్థాలు, కూల్ డ్రింక్స్‌, ప‌చ్చి గుడ్లు వంటి ఆహార ప‌దార్థాలు అస్స‌లు తీసుకోరాదు.

ఇవి తీసుకోవ‌డం వ‌ల్ల మిస్ క్యారీ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది.కాబ‌ట్టి, ఈ ఆహార ప‌దార్థాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

What Happens Of Eating Drumstick During Pregnancy! Drumstick, Pregnancy, Eating Drumstick, Latest News, Pregnant, Tips For Pregnant, Health, Health Tips - Telugu Drumstick, Tips, Latest, Pregnancy, Pregnant, Tips Pregnant

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube