జనతా గ్యారేజ్ విషయంలో జరిగిన తప్పు దేవరలో జరగదు.. కొరటాల కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో కొరటాల శివ ( Koratala Shiva ) ఒకరు.మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ అనంతరం భరత్ అనే నేను, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Koratala Shiva Interesting Comments On Ntr Devara And Janatha Garge Movies , Jan-TeluguStop.com

ఇలా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన ఈయన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా కొరటాల మార్క్ కనిపించలేదు.

Telugu Acharya, Devara, Janatha Garge, Janhvi Kapoor, Koratala Shiva-Movie

ఈ విధంగా ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఒక్కసారిగా ఈయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు మొత్తం మంట కలిసిపోయాయి.దీంతో ఎన్టీఆర్( NTR )హీరోగా దేవర సినిమాకు కమిట్ అయిన కొరటాల ఈ సినిమాని ఎంతో కసిగా తీసారనే చెప్పాలి.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్లలో భాగంగా కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Telugu Acharya, Devara, Janatha Garge, Janhvi Kapoor, Koratala Shiva-Movie

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఇదివరకు నటించిన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా గురించి ఈయన మాట్లాడుతూ జనతా గ్యారేజ్ సినిమా విడుదలైన మొదటి రోజు నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ టాక్ కూడా ఎన్టీఆర్ అభిమానులే స్ప్రెడ్ చేశారని తెలిపారు.

అయితే ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు మొదట్లో నచ్చలేదు కానీ ఆ తర్వాత చాలా ఇష్టపడి ఈ సినిమాని సక్సెస్ చేశారని తెలిపారు.కానీ దేవర ( Devara ) విషయంలో అలా ఉండదని మొదటి షో నుంచే ఎన్టీఆర్ అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ ఈయన సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో అంచనాలను పెంచేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube