టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా నాగార్జున( Nagarjuna )కు పేరుంది.ఈ ఏడాది నా సామిరంగ అనే సినిమాతో నాగార్జున మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
విజయ్ బిన్నీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.థియేటర్లలో ఈ సినిమాకు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి.
గుంటూరు కారం, హనుమాన్ సినిమాలతో పోటీపడి ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు.
ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )కు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు కుబేర, కూలీ సినిమాలలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుండగా ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మరోవైపు కూలీ సినిమా కోసం నాగార్జున ఏకంగా 24 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని వార్తలు మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా నాగార్జున తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే.నాగార్జున ఆస్తులకు సంబంధించిన వివరాలు సైతం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.
స్టార్ హీరో నాగార్జున ఆస్తుల విలువ ఏకంగా 3100 కోట్ల రూపాయలు అని తెలిసి నెటిజెన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వరుసగా వ్యాపారాలు చేయడం ద్వారా నాగార్జున కళ్ళు చెదిరే లాభాలను సొంతం చేసుకుని ఈ స్థాయిలో ఆస్తులను కూడబెట్టారని సమాచారం అందుతోంది.సౌత్ ఇండియాలోని రిచ్ హీరోలలో నాగార్జున ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.నాగార్జున కొడుకు నాగచైతన్య( Naga Chaitanya ) ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
అక్కినేని అఖిల్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమాల షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది.