కమలా హారిస్‌‌కు లభించని తండ్రి మద్ధతు .. వైట్‌హౌస్ పక్కనే ఇల్లు, అయినా దూరంగానే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ) దూసుకెళ్తున్నారు.ఇప్పటికే ఓపీనియన్ పోల్స్, ముందుస్తు సర్వేలలో ట్రంప్‌తో పోలిస్తే ముందంజలో ఉన్నారు.

 Kamala Harris's Father, Living 1 Mile From White House, Never Visited Her , Kama-TeluguStop.com

భారత సంతతి, దక్షిణాసియా, నల్లజాతి సమాజాలు ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలతో పాటు అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికాను ఎలా అభివృద్ధి చేస్తానో బ్లూ ప్రింట్ ద్వారా వివరిస్తున్నారు .ఇదిలాఉండగా.కమలా హారిస్ కుటుంబం నుంచి పలువురు ఆమెకు మద్ధతుగా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఆమె తండ్రి డొనాల్డ్ హారిస్ ప్రచారానికి వస్తారా రారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఇద్దరి మధ్య సంబంధాలు అంత బాలేదని.వైట్‌హౌస్‌లోని కమలా హారిస్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలోనే డొనాల్డ్ హారిస్( Donald Harris ) నివసిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా కుమార్తెను చూడటానికి ఆయన రాలేదంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

Telugu Donald Harris, Joe Biden, Kamala Harris, Shyamalagopalan, Calinia, Presid

చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌ న్యూట్రిషన్‌, ఎండోక్రినాలజీలో పరిశోధన నిమిత్తం అమెరికా వెళ్లారు.యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా( University of California )లో జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారీ‌స్‌తో ఆమెకు పరిచయమై ప్రేమగా మారి అది కాస్తా పెళ్లికి దారితీసింది.ఈ దంపతులకు కమలా హారిస్, మాయా హారిస్ సంతానం.

అయితే కమలకు ఏడేళ్ల వయసున్నప్పుడే శ్యామల- హారిస్‌లు విడిపోయారు.అయితే శ్యామల తన ఇద్దరు పిల్లలతో కెనడా, ఇల్లినాయిస్‌, కాలిఫోర్నియాలలో నివసించారు.ఆ ప్రభావం తనపై బలంగా పడిందని కమలా హారిస్ పలుమార్లు చెప్పుకొచ్చారు.2009లో శ్యామలా గోపాలన్( Shyamala Gopalan Harris ) క్యాన్సర్‌తో మరణించిన తర్వాత తండ్రి డొనాల్డ్ హారిస్ మాత్రమే కమలకు పెద్ద దిక్కు.

Telugu Donald Harris, Joe Biden, Kamala Harris, Shyamalagopalan, Calinia, Presid

కానీ కూతురితో ఆయన అనుబంధం ఏమాత్రం బాలేదని చెబుతుంటారు.తన బిడ్డ అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించినప్పటికీ కమల గురించి డొనాల్డ్ హారిస్ ఏనాడూ ప్రస్తావించలేదు.అయితే తండ్రిలోని కమ్యూనిస్ట్ భావాలు కమలా హారిస్ పుణికిపుచ్చుకుందని రాజకీయ ప్రత్యర్ధులు సైతం ఆరోపిస్తుంటారు.ట్రంప్ సైతం ప్రతిసారి ఇదే ఆరోపణలు చేస్తుంటారు.గతం ఎలా ఉన్నా అగ్రరాజ్యానికి అధ్యక్షురాలు కావడానికి కమలా హారిస్ పోరాడుతున్నారు.ఇలాంటి సమయంలో తన కుమార్తెకు మద్ధతుగా చిన్న ప్రకటన విడుదల చేసినా అది ఆమెకు మానసికంగా స్ధైర్యాన్ని ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube