అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ) , రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు వీరిద్దరూ ఆకర్షణీయమైన హామీలను ప్రకటిస్తున్నారు.ఈ నేపథ్యంలో కమలా హారిస్ ఓ సంచలన ప్రకటన చేశారు.
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా అధికారికంగా ఖరారైన తర్వాత ఆమె తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తాను అధికారంలోకి వస్తే రిపబ్లికన్ పార్టీ నేతను( Republican Party ) కేబినెట్లోకి తీసుకుంటానని కమల సంచలన ప్రకటన చేశారు.
అమెరికాలోకి అక్రమ వలసలను నియంత్రిస్తానని, ఈ విషయంలో కఠినంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.కానీ ఎన్నో ఏళ్లుగా తాను అనుసరిస్తున్న ఉదారవాద విధానాలను మాత్రం వదిలిపెట్టేది లేదని కమలా హారిస్ స్పష్టం చేశారు.
అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని.దేశ ప్రజల శక్తి సామర్ధ్యాలను తక్కువ చేసేలా ఆయన తీరు ఉందన్నారు.

అధికారంలోకి వస్తే చమురు వెలికితీతను నిషేధించనని కమలా హారిస్ క్లారిటీ ఇచ్చారు.ఇదే ఇంటర్వ్యూలో హమాస్ – ఇజ్రాయెల్ ( Hamas – Israel )యుద్ధాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.గాజాలో కాల్పుల విరమణ జరగాలని.అమెరికాకు మిత్రదేశమైన ఇజ్రాయెల్ విషయంలో జో బైడెన్( Joe Biden ) విధానాలనే తాను కూడా అనుసరిస్తానని కమలా హారిస్ వెల్లడించారు.
ట్రంప్ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె దుయ్యబట్టారు.ఇదే ఇంటర్వ్యూలో కమలా హారిస్ రన్నింగ్‌మెట్ , మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.

మరోవైపు.అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందిస్తానని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.ఇప్పటికే గర్భవిచ్చిత్తి హక్కులు అన్న అంశం అమెరికా రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే.ఇటీవలే 1973 నాటి రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.