ఫలించిన కేంద్రం కృషి.. ఖతర్ కస్టడీ నుంచి గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులకు విముక్తి

భారత జాతీయుడి నుంచి స్వాధీనం చేసుకున్న సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌కు( Guru Granth Sahib ) చెందిన రెండు సరూప్‌లను ఖతర్( Qatar ) అధికారులు దోహాలోని భారత రాయబార కార్యాలయానికి( Indian Embassy ) అందజేసినట్లుగా భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) బుధవారం తెలిపింది.ఇందుకు గాను ఖతర్ ప్రభుత్వానికి తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కేంద్రం వెల్లడించింది.

 Qatar Officials Hands Over 2 Seized Saroops Of Guru Granth Sahib To Indian Embas-TeluguStop.com

ఈ సందర్భంగా ఖతర్ లేదా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరూ అన్ని అంశాలలో స్థానిక చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది.

Telugu Seized Saroops, Doha, Indian Embassy, Mea Jaishankar, Qatar, Randhir Jais

అనుమతి లేకుండా మతపరమైన కేంద్రం నడిపిన కేసులో ఖతర్ అధికారులు సరూప్‌లను స్వాధీనం చేసుకున్నారు.గత వారం భారతదేశంలోని సిక్కు సంఘాలు ఈ సమస్యను లేవనెత్తడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సిక్కుల( Sikhs ) అత్యున్నత నిర్ణాయక సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ వేర్వేరుగా తమ నిరసనను వ్యక్తం చేశాయి.

Telugu Seized Saroops, Doha, Indian Embassy, Mea Jaishankar, Qatar, Randhir Jais

దాదాపు ఎనిమిది నెలలుగా ఖతర్ అధికారుల కస్టడీలో ఉన్న శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ జీకి చెందిన రెండు ‘సరూప్స్’ను( Saroops ) కాపాడేందుకు దౌత్యపరమైన జోక్యాన్ని కోరుతూ బీజేపీ నేత సుఖ్మీందర్‌పాల్ సింగ్ గ్రేవాల్( Sukhminderpal Singh Grewal ) ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు( S Jaishankar ) లేఖ రాశారు.ఈ లేఖలో .ఖతార్‌లోని సిక్కు సమాజ వేదనను గ్రేవాల్ పంచుకున్నారు.ఖతార్‌లోని సిక్కు సంగత్ (కమ్యూనిటీ) ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రంథాల విడుదలలో నేటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు.

ఈ పరిణామాలతో సిక్కు సమాజం దిగ్భ్రాంతి, వేదనలో ఉందన్నారు.

సరూప్‌లను తక్షణమే విడుదల చేయడానికి, అక్కడ గురుద్వారాల ఏర్పాటులో జోక్యం చేసుకోవాలని ఖతార్ ప్రభుత్వంతో చర్చించాలని జైశంకర్‌కు గ్రేవాల్ విజ్ఞప్తి చేశారు.

సిక్కులు తమ విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించగలరని నిర్ధారించుకోవడానికి అక్కడి భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని మంత్రిని గ్రేవాల్‌ అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube