విదేశీ వలసలను తగ్గించేందుకు గాను అనేక దేశాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.తాజాగా ఈ లిస్ట్‌లోకి కెనడా( Canada ) కూడా చేరింది.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో( PM Justin Trudeau ) తన మంత్రివర్గ సహచరులతో దీనిపై చర్చించారు.దీనిలో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మూడు మార్పులు చేయగా.
సెప్టెంబర్ 26 నుంచి అవి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబున్నాయి.కన్‌స్ట్రక్షన్, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఇందులో మినహాయింపు ఉంటుందని ప్రధాని చెబుతున్నారు.
కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస దరఖాస్తులు దాదాపు 25 శాతం తగ్గనున్నాయి, అలాగే విదేశీ విద్యార్ధుల స్టడీ పర్మిట్లు( Study Permits ) కూడా తగ్గుతాయి.దీని వల్ల భారతీయ విద్యార్ధులకు( Indian Students ) అధిక నష్టం కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు.కొత్త విధానం కారణంగా దాదాపు 70 వేల మంది విద్యార్ధులు దేశ బహిష్కరణకు( Deportation ) గురవుతారని అంటున్నారు.

దీంతో అక్కడికి వెళ్లిన వారికి, కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయ విద్యార్ధులకు తమ భవిష్యత్తుపై భయం పట్టుకుంది.ఈ విధానాన్ని నిరసిస్తూ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్( Prince Edward Island ) ప్రావిన్స్‌లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు.ఇక్కడ ఒక్కచోటే కాదు.ఆంటారియో, మనిటోబా, బ్రిటీష్ కొలంబియాల్లో ఎప్పటి నుంచో నిరసనలు జరుగుతున్నాయి.ఈ ఏడాది చివరి నాటికి చాలా మంది విద్యార్ధుల వర్క్ పర్మిట్లు ముగుస్తుండటంతో .దేశం విడిచి వెళ్లాలా అనే భయం వారిని వెంటాడుతోంది.

ప్రస్తుతం కెనడాలో గృహ సంక్షోభం, ఉద్యోగ సంక్షోభం తీవ్రరూపు దాల్చింది.వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ .ఈ పరిణామాలు ట్రూడో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి.ఇప్పటికే అనేక సర్వేల్లోనూ ట్రూడో పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.
అందుకే వీటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని ఇలాంటి విపరీత చర్యలకు దిగుతున్నారని అంతర్జాతీయ సిక్కు విద్యార్ధి సంఘం ఆరోపించింది.