దొంగతనానికి వచ్చాడు.. బుక్ కనిపించడంతో అది చదువుతూ చోరీ గురించే మర్చిపోయాడు..?

రోమ్‌లోని( Rome ) ప్రాతి జిల్లాలో, ఒక దొంగ ఇంట్లోకి చొరబడిన తర్వాత చోరీ గురించే మర్చిపోయిన విచిత్ర ఘటన జరిగింది.దానికి కారణం ఒక పుస్తకం!( Book ) అవును, మీరు చదివింది నిజమే! 38 ఏళ్ల ఆ గుర్తు తెలియని వ్యక్తి బాల్కనీ గుండా ఒక అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు.

 Italian Thief Puts Stealing On Hold To Read A Book Details, Nri News, Book, Thef-TeluguStop.com

కానీ, పక్కనే ఉన్న బెడ్ మీద ఓ పుస్తకం కనిపించగానే అతని దృష్టి దానివైపుకు మళ్లిపోయింది.ఇంటి యజమాని (71 ఏళ్లు) ఇంట్లో ఉన్నప్పుడే అతను చొరబడ్డాడు.

ఆ వృద్ధుడు ఆ దొంగను ఫేస్ చేశాడు.కానీ, ఆ దొంగ( Thief ) ఆ పుస్తకంలోనే మునిగిపోయాడు.

చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు.చివరికి ఆ దొంగ అదే బాల్కనీ గుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు.

Telugu Giovanni Nucci, Italian Thief, Nri, Prati, Read, Rome, Gods Oclock, Theft

ఆ దొంగను ఆకట్టుకున్న పుస్తకం పేరు ‘ది గాడ్స్ అట్ సిక్స్ ఓ’క్లాక్’.( The Gods at Six O’Clock ) దీన్ని గియోవన్నీ నుక్కి( Giovanni Nucci ) రాశాడు.ఆ పుస్తక రచయిత తన పుస్తకం ఇలాంటి సంఘటనకు కారణమైందని తెలుసుకొని ఎంతో సంతోషించాడు.“ఇది అద్భుతం.ఆ పుస్తకం చదువుతూ అరెస్టు అయిన వ్యక్తిని కనుగొని, ఆ పుస్తకం అతనికి ఇవ్వాలనుకుంటున్నాను.అతను ఆ పుస్తకం చదవడం పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను” అని నుక్కి ఇటాలియన్ వార్తాపత్రిక ఇల్ మెస్సాజెరోతో అన్నారు.

Telugu Giovanni Nucci, Italian Thief, Nri, Prati, Read, Rome, Gods Oclock, Theft

ఆ దొంగ పోలీసులతో అదే భవనంలో ఉండే తన స్నేహితుడిని కలవడానికి బాల్కనీ ఎక్కినట్లు చెప్పాడట.“నేను ఏదో హోటల్‌లోకి వచ్చేశాననుకున్నాను.ఆ పుస్తకం కనిపించగానే చదవడం మొదలుపెట్టాను” అని ఆ దొంగ చెప్పాడు.ఆ రాత్రి మరొక ఇంటి నుంచి దొంగతనం చేసిన ఖరీదైన బట్టల సంచి ఆ దొంగ వద్ద కూడా లభించిందని బీబీసీ నివేదించింది.

ఒక దొంగ లక్నోలోని ఇందిరానగర్ సెక్టార్ 20లోని ఒక ఇంట్లోకి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు.కానీ, అతను చాలా మద్యం తాగి వచ్చాడు కాబట్టి, దొంగతనం చేసిన తర్వాత ఎయిర్ కండిషనర్ వెలిగించుకొని నిద్రపోయాడు.

మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి అతన్ని మేల్కొలిపారు.ఈ ఇల్లు వారణాసిలో పనిచేసే డాక్టర్ సునీల్ పాండే అనే వ్యక్తిది.

ఆయన ఇంట్లో లేకపోవడంతో ఈ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube