త్వరలో ఏపీలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ విషయంలో టిడిపి, జనసేన, బిజెపిలలో( TDP Janasena BJP ) పోటీ నెలకొంది ఎవరికి వారు కీలకమైన నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు( CM Chandrababu ) మూడు పార్టీల కీలక నేతలతో సమావేశం నిర్వహించి, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు.
ఎవరికి ఎన్ని కేటాయించాలనే దానిపైన ఒక విధానాన్ని రూపొందించుకున్నారు.
అయినా ఈ పోస్టుల భర్తీలో తమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనలు మిగతా రెండు పార్టీల నుంచి వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి ఒక అడుగు ముందుకు వేసింది.పార్టీ కోసం కష్టపడిన తమ కార్యకర్తల కోసం బిజెపి తమకు ఎక్కువ పదవులు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది .ఈ మేరకు ఢిల్లీ నుంచి బిజెపి నేషనల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివప్రకాష్( Shiv Prakash ) నేరుగా ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం.
గత ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకున్న మాదిరిగానే నామినేటెడ్ పదవుల( Nominated Posts ) భర్తీలో బిజెపికి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ,( Purandareswari ) శివ ప్రకాష్ కలిసి ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి వెళ్లినట్టు సమాచారం.ఈ విషయంలో టిడిపి కూడా సానుకూలంగానే ఉందట.
చంద్రబాబుతో సమావేశం కంటే ముందు విజయవాడలోని పురందరేశ్వరి నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో శివప్రసాద్ సమావేశం అయ్యారు.నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ నేతలతో చర్చించారు.
ఆ తర్వాతనే పురందరేశ్వరి , శివ ప్రకాష్ వెళ్లి చంద్రబాబును కలిసినట్లు సమాచారం.ఇదే విషయమే బిజెపి నేత ఏపీ మంత్రి సత్య కుమార్ స్పందించారు .పార్టీ కోసం పని చేసిన బీజేపీ కార్యకర్తలు నామినేటెడ్ పదవులు కోరుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. బాధ్యతలు, పదవులు అప్పగిస్తే మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని, దానిపై కూటమిలో చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.