కాపాడాల్సిన నాన్నే వేధింపులకు పాల్పడ్డాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఖుష్బూ.( Kushboo ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Khushbu Sundar Shaken Amid Sexual Assault Claims In Malayalam Film Industry Deta-TeluguStop.com

తెలుగుతోపాటు తమిళ, కన్నడ బాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఖుష్బూ.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ఖుష్బూ.ఇది ఇలా ఉంటే తాజాగా హేమ కమిటీ రిపోర్ట్‌ ను( Hema Committee Report ) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ.

ఈ మేరకు ఆమె స్పందిస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా రాసుకొచ్చింది.

Telugu Hema Committee, Khushbu Sundar, Kollywood, Kushboo, Malayalam, National,

మన చిత్ర పరిశ్రమలో మహిళలు( Women ) ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం.వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలి.వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్‌ ఎంతో ఉపయోగపడింది.

కెరీర్‌ లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్‌మెంట్‌( Commitment ) ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయి.పురుషులకూ ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు.

కానీ ఎక్కువగా వేధింపులు ఎదుర్కొనేది స్త్రీలే.ఈ విషయంపై నా కుమార్తెలతోనూ సవివరంగా చర్చించాను.

మీరు ఎప్పుడు మాట్లాడారనేది విషయం కాదు.ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా వచ్చి చెప్పాలి.

ఘటన జరిగిన వెంటనే మాట్లాడితే దర్యాప్తునకు సహాయ పడుతుంది.

Telugu Hema Committee, Khushbu Sundar, Kollywood, Kushboo, Malayalam, National,

బాధితులకు మన సపోర్ట్‌ ఎంతో అవసరం.వారి బాధను మనం వినాలి.మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి.

సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు.బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా.తండ్రి వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు అంత సమయం తీసుకున్నావు? అని చాలామంది గతంలో నన్ను అడిగారు.నిజమే నేను ముందే మాట్లాడాల్సింది.

ఆ ఘటన కెరీర్‌ విషయంలో జరిగింది కాదు.నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులు ఎదుర్కొన్నాను.

చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.చిన్న గ్రామాలకు చెందిన ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు.

వారి ఆశలను ఆదిలోనే తుంచేస్తున్నారు అని రాసుకొచ్చింది ఖుష్బూ. అయితే పురుషులందరికీ నేను చెప్పేది ఒక్కటే బాధిత మహిళలకు అండగా నిలవండి.మహిళలపై జరుగుతున్న ఈ సంఘటనలపై మీరు కూడా స్పందించాలి.మీ ప్రేమ, మద్దతును వారికి అందజేయండి.గుర్తుంచుకోండి, అందరూ కలిసి ఈ గాయాలు మానేలా చేయగలం.ఈ నివేదిక మనందరిలో మార్పు తీసుకురావాలి అని ఖుష్బూ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube