బిజెపి ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ మంత్రి కొండ సురేఖ( Minister Konda Surekha ) మెడలో నూలు దండ వేయడాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేయడం , దీనిపై కొండ సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ పెద్దలపై ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన( KTR ) విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.తనను ట్రోల్ చేశారన్న ఆగ్రహంతో కొండ సురేఖ అతిగా స్పందించి , ఈ వ్యవహారం తో సంబంధం లేని సినీ హీరో నాగార్జున( Nagarjuna ) కుటుంబం పైన ఆరోపణలు చేశారు.
అయితే ఆ విమర్శలు పై కొండా సురేఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో , ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.అయితే ఈ విషయంలో నాగార్జున కొండ సురేఖ పై పరువు నష్టం దావా వేశారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) పిలుపునిచ్చారు.అయినా ఈ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది స్పందిస్తున్నారు.కొండ సురేఖ తాను చేసిన తప్పు ను గుర్తించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పినా, సినీ ప్రముఖులు ఈ వ్యవహారంపై పదే పదే స్పందిస్తుండడం వంటివి కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో టాలీవుడ్ కు చెందిన వారు సైలెంట్ గానే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అతిగా స్పందిస్తుండడం వంటివి రేవంత్ రెడ్డి తో( CM Revanth Reddy ) పాటు కాంగ్రెస్ ప్రముఖులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.
ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి చేసినా టాలీవుడ్ ప్రముఖులు ఈ వ్యవహారంపై స్పందిస్తూనే ఉండడం పై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నారట. గద్దర్ అవార్డులు విషయంలో టాలీవుడ్ ప్రముఖులు ఎవరు కలిసి రావడం లేదు కానీ , టికెట్ల రేట్ల పెంపు ఇతర ప్రయోజనాలు విషయంలో మాత్రం ప్రభుత్వం వద్దకు పదేపదే వస్తున్నారని, ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే ముందుంటున్నారని రేవంత్ అభిప్రాయపడుతున్నారట .అందుకే టాలీవుడ్ విషయంలో ఇకపై సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని , కఠినంగానే వ్యవహరించాలనే ఆలోచనతో ఉన్నారట.అయితే స్పందన లేకపోవడం , లేక పోతే అతిగా స్పందించడం వంటి వ్యవహారాలు రేవంత్ కు నచ్చడం లేదట.