అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన సింగపూర్( Singapore ) మాజీ రవాణా శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు( S Iswaran ) ఈ కేసులో కోర్టు శిక్ష విధించింది.తన స్నేహితులుగా భావించే ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్లలో దాదాపు 4,03,300 సింగపూర్ డాలర్ల విలువైన బహుమతులు పొందినందుకు గాను హైకోర్ట్ ఈశ్వరన్‌కి 12 నెలల జైలుశిక్ష విధించింది.ఈ కేసులో 4 కౌంట్ల ఆరోపణలను ఆయన అంగీకరించగా.56 మంది సాక్షులను ప్రాసిక్యూటర్లు విచారించారు.తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ విన్సెంట్ హూంగ్( Justice Vincent Hoong ) మాట్లాడుతూ.ఈ శిక్ష ప్రభుత్వ సంస్థలపై నమ్మకం, విశ్వాసం సమర్థవంతమైన పాలనకు పునాది అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత ప్రమాణాలతో విధులు నిర్వర్తించాలని.ఆర్ధిక ప్రయోజనాల ప్రభావానికి లోనవుతారనే భావనకు దూరంగా ఉండాలని న్యాయమూర్తి సూచించారు.
ఈశ్వరన్ తరపు న్యాయవాది దేవిందర్ సింగ్ 8 వారాల కంటే ఎక్కువ జైలుశిక్ష వద్దని కోర్టును కోరగా.డిప్యూటీ అటార్నీ జనరల్ మాత్రం ఆరు నుంచి ఏడు నెలల జైలు శిక్ష విధించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
ఇరుపక్షాలు కోరిన దానికంటే మించి శిక్ష విధించాలని తాను భావిస్తున్నానని న్యాయమూర్తి అన్నారు.
ఈశ్వరన్ తరపు న్యాయవాదులు జైలు శిక్షను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేయాలని కోరారు.అలాగే ఈశ్వరన్ ఆరోజు రాష్ట్ర న్యాయస్థానంలో సాయంత్రం 4 గంటలకు లొంగిపోయేందుకు అనుమతించాలని కోరినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ)( Corrupt Practices Investigation Bureau ) దర్యాప్తు వివరాలు వెలుగులోకి వచ్చి, ఈశ్వరన్‌పై అభియోగాలు మోపిన ఏడాదిలోగా ఆయనకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
కాగా.బ్రిటన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజిక్ కన్సర్ట్‌లు, సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ టికెట్‌లు సహా పలు వస్తువులను సింగపూర్ వ్యాపారవేత్త ఓంగ్ నుంచి ఈశ్వరన్ పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.సింగపూర్‌లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి రాజీనామా చేసిన ఈశ్వరన్ జనవరి 16న రవాణా మంత్రి పదవితో పాటు తన పార్లమెంటరీ స్థానానికి కూడా రాజీనామా చేశారు.1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికై ఆయన 2006లో మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.