అల్లు అర్జున్ ( Allu Arjun )హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప 2 ‘ద రూల్’ ( Pushpa 2 ‘The Rule’ )సినిమా రిలీజ్ అవ్వడానికి మరొక 100 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇక ఈ క్రమంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలైతే పెరిగిపోతున్నాయి.ఇక ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్ సన్నాహాలు చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.
దాంతో డిసెంబర్ 6వ తేదీకి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని సినిమా యూనిట్ తెగ ఆరాట పడుతుంది.

మరి మొదటి పార్ట్ సక్సెస్ అయినట్టుగానే సెకండ్ పార్ట్ కూడా అదేవిధంగా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ తనను తాను స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటున్నాయి.ఇక పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకొని 1500 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
ఒకవేళ ఈ సినిమాతో ఆయన 1000 కోట్ల కలెక్షన్స్ ను కనక సంపాదించినట్టయితే ఆయన పేరు ఇండస్ట్రీలో మరోసారి మారు మ్రోగుతుందనే చెప్పాలి.

ఇక ఇప్పటికే పుష్ప మొదటి పార్ట్ తో నేషనల్ అవార్డును గెలుచుకొని స్టార్ హీరో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా 1500 కోట్ల వరకు కలెక్షన్ రాబడుతుందని అందరూ నమ్ముతున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే సినిమా మేకర్స్ తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తున్నారు.
ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.