కేవలం రూ.120తో బతుకుతున్న జపనీస్ మహిళ.. పొదుపుతో మూడు ఇళ్లు కొనేసింది..?

సేవింగ్స్( Savings ) చేస్తూ చాలా మనీ వెనకేయాలని అందరూ అనుకుంటారు.డైలీ లేదా మంత్లీ బడ్జెట్ తగ్గించుకోవాలని భావిస్తారు.

 Japanese Woman Buys 3 Houses Opens Cat Cafe By 34 Spending Just Rs 120 On Food D-TeluguStop.com

కానీ అది చాలామందికి అసాధ్యమైన కలలా అనిపిస్తుంది.అయితే ఒక జపాన్ మహిళ( Japanese Woman ) మాత్రం ఈ కలను నిజం చేసుకుంది.37 ఏళ్ల సకి తమోగామి( Saki Tamogami ) 15 ఏళ్ల కాలంలో మూడు ఇళ్లు కొని, ఒక క్యాట్ కాఫీ షాప్‌ను( Cat Cafe ) సైతం ప్రారంభించింది.ఇది అంతా ఆమె ఆర్థిక క్రమశిక్షణ వల్ల సాధ్యమైంది.

ఆమె తన ఖర్చులను జాగ్రత్తగా గమనించి, ఆదా చేసిన డబ్బును పెట్టుబడి పెట్టింది.అనవసరమైన ఖర్చులను పూర్తిగా మానేసి ‘దేశంలోనే అత్యంత మితంగా ఖర్చు చేసే యువతి’గా ఒక బిరుదు కూడా తెచ్చుకుంది.ఈ మహిళ చాలా ఏళ్లుగా రోజుకు కేవలం 200 యెన్లు (సుమారు రూ.120) బడ్జెట్‌తోనే జీవించింది.

Telugu Houses, Cat Cafe, Japan, Japanese, Nri, Saki Tamogami, Sakitamogami-Telug

సకికి 34 ఏళ్లు వచ్చేసరికి మూడు ఇళ్లు కొనాలనే ఓ పెద్ద కల ఉంది.ఆమెకి 20 ఏళ్ల వయసులో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది.ఆ తర్వాత చాలా సింపుల్‌గా జీవించడం మొదలుపెట్టింది.సొంతంగా వండుకుని తింటూ ఉండేది.బ్రెడ్, ఉడోన్ నూడుల్స్, తక్కువ ధరకొచ్చే ముల్లంగి వంటి ఆహారం తింటూ జీవించేది.అప్పుడప్పుడూ బ్రెడ్ మీద జామ్ లేదా అన్నంతో సాల్మన్ చేప వంటి ఇష్టమైన ఆహారాలు తింటూ ఉండేది.

కానీ ఆహారం మీద ఎక్కువ ఖర్చు చేసేది కాదు.అలా అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడింది.

Telugu Houses, Cat Cafe, Japan, Japanese, Nri, Saki Tamogami, Sakitamogami-Telug

సకి కొత్త బట్టలు కొనడం కూడా మానేసింది.స్నేహితులు ఇచ్చిన పాత బట్టలే వేసుకునేది.అలాగే, ఆమె ఇంటికి కావలసిన ఫర్నిచర్‌ను జంక్ మార్కెట్ల నుంచి తీసుకునేది.తన వెంట్రుకలు చాలా పొడవుగా పెరిగినప్పుడు, వాటిని అమ్మి 3,100 యెన్లు (సుమారు రూ.1,800) సంపాదించింది.ఇది 6 నెలల ఎక్స్‌పెన్సెస్‌కు సరిపోయేది.27 ఏళ్ల వయసులో సకి సైతామాలో 10 మిలియన్ యెన్‌లకు (సుమారు రూ.61 లక్షలు) ఒక ఇల్లు కొనడానికి సరిపడా డబ్బు ఆదా చేసింది.ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి, ఆదాయంతో రుణం తీసుకుని మరో రెండేళ్లలో 18 మిలియన్ యెన్లకు (రూ.1.1 కోట్లు) రెండవ ఇల్లు కొన్నది.2019 నాటికి, ఆమె లక్ష్యం ప్రకారం 37 మిలియన్ యెన్లకు (సుమారు రూ.2.3 కోట్లు) మూడవ ఇల్లు కొనుగోలు చేసింది.

మూడు ఇళ్లు కొనాలనే కోరిక తీరాక, మరో కల అయిన క్యాట్ కాఫీ షాప్‌ను ప్రారంభించింది.తన మూడవ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ను క్యాట్ కాఫీ షాప్‌గా మార్చి, దీనికి ‘కాఫీ యునాగి’ అని పేరు పెట్టింది.

ఈ కాఫీ షాప్‌లో వీధి పిల్లులకు ఆశ్రయం ఇచ్చింది.జంతువులను చాలా ప్రేమించే సకి, ఈ కాఫీ షాప్ ద్వారా వచ్చే డబ్బుతో మరెన్నో పిల్లులను రక్షించాలని భావిస్తుంది.

మూడు ఇళ్ళు కొన్నప్పటికీ, సకి ఇప్పటికీ చాలా సాధారణంగా జీవిస్తుంది.ఇళ్లు అద్దెకు ఇచ్చి వచ్చే డబ్బుతో పాటు తన జీతంతో మరెన్నో ఇళ్లు కొనాలని ప్లాన్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube