ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడు.. థమన్ తల్లి కామెంట్స్ వైరల్!

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే.ఈ మాట మనం చాలా సార్లు వినే ఉంటాం.

 Thaman Mother Savithri Intresting Comments On Her Son, Savithri, Thaman, Tollywo-TeluguStop.com

కొడుకు బిడ్డలు ఎంత ఎదిగినా, ఏ స్థాయిలో ఉన్నా కూడా తల్లికి మాత్రం బిడ్డలే.వారి గురించి తల్లికి తెలిసినన్ని విషయాలు ఎవరికీ తెలియవు.

ఇప్పుడు సంగీత దర్శకుడైన తమన్( Thaman S ) గురించి కూడా అతని తల్లి ఎవరికీ తెలియని నాలుగు ముచ్చట్లు తెలిపింది.ఆ వివరాల్లోకి వెళితే.

తెలుగు ప్రేక్షకులకు తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలకు సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

Telugu Savithri, Thaman, Thaman Mother, Tollywood-Movie

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకరు.ఇది ఇలా ఉంటే తమన్ తల్లి ఘంటసాల సావిత్రి తొలిసారి ఒక వేదిక మీదకు వచ్చారు.ఆహా ఇండియన్ ఐడిల్( Telugu Indian Idol 2024 ) కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఆమె వచ్చిన ప్రోగ్రామ్ ప్రోమో బయటకు వదిలారు.ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ప్రోమోలో తమను తల్లి సావిత్రి( Savithri ) మాట్లాడుతూ.తమన్ ను ఇంట్లో సాయి అని పిలుస్తారు అన్న సంగతి చాలా మందికి తెలుసు.

ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పుడు ఎలా వుండేవాడు అని అడగగా.

Telugu Savithri, Thaman, Thaman Mother, Tollywood-Movie

చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా ప్లే గ్రౌండ్ లో ఎక్కువగా వుండేవాడు.ఇప్పుడు కూడా అంతే.సాయంత్రం అయితే చాలు ఎక్కడ వున్నా తమన్ క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లాల్సిందే.

చాలా అల్లరి చేసేవాడు.అస్సలు భయం లేదు.

స్కూళ్లలో గొడవలు వచ్చేవి.తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడు అంటూ కంప్లయింట్ లు వుండేవి.

అలా అని స్కూలు మాన్పిస్తే లేడీస్ స్పెషల్ లో స్కూలుకు వెళ్లేవాడు.కానీ హార్డ్ వర్కర్, పని అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడు అని సావిత్రి గారు నవ్వుతూ తెలిపారు.

ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడు అంటూ కొడుకు పై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత డీసెంట్ గా ఉన్న థమన్ చిన్నప్పుడు ఇంత అల్లరి చేసేవారా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఆ ప్రోమోలో తన తల్లి చేస్తున్న వ్యాఖ్యలకు సిగ్గుతో నవ్వుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube